దేశంలోని శనగల ఉత్పాదక కేంద్రాలలో కొత్త సరుకు రాబడులు పెరుగుతున్నాయి. అయితే రాబోవు రోజులలో ప్రభుత్వ ఏజెన్సీల కొనుగోళ్లు మరియు హోళి, ఉగాది, వివాహాల సీజన్ కోసం మిల్లర్ల కొనుగోళ్లతో ధరలు ఎక్కువగా తగ్గే అవకాశం లేదు. ఏప్రిల్ నుండి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యాణాలలో రాబడులు పెరగగలవు. ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణలలో సరుకు రాబడులు పెరుగుతున్నాయి. తద్వారా ముంబైలో టాంజానియా శనగలు రూ. 4450 – 4475, రష్యా కాబూలీ శనగలు రూ. 4600-4700, సూడాన్ సరుకు రూ. 5000-5250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
దిల్లీ లారెన్స్ రోడ్లో గత వారం 130 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 150 తగ్గి రూ. 5170, మధ్య ప్రదేశ్ ప్రాంతపు సరుకు రూ.5100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్, గోండల్, జామ్నగర్, జునాగఢ్ ప్రాంతాలలో 35-40 వేల బస్తాల కొత్త శనగల రాబడిపై రూ. 4000-4650 ఆ క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 100-150 వాహనాల శనగల రాబడి అవుతున్నాయి. కర్నూలులో జెజె రకం శనగలు రూ. 4625, ఒంగోలు జెజె శనగలు రూ. 4500, కాక్-2 కాబూలీ శనగలు రూ. 6700, డాలర్ శనగలు రూ. 8300 మరియు కర్ణాటకలోని హుబ్లీ, ధార్వాడ్ ప్రాంతాల శనగలు రూ. 5100, గదగ్ ప్రాంతం సరుకు రూ. 5150, రాయిచూర్ సరుకు రూ. 5175 ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి 20-25 వేల బస్తాల రాబడిపై స్థానికంగా రూ. 4500-4700 మరియు మహారాష్ట్రలోని లాతూర్లో 30-35 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై విజయ, అన్నిగిరి శనగలు రూ. 4700-4900, ఖాంగాంప్లో 8-10 వేల బస్తాలు, దరియాపూర్లో 10 వేల బస్తాలు, ఇతర ఉత్పాదక కేంద్రాలలో 40-50 వేల బస్తాల రాబడిపై రూ. 4500-4800, విశాల్ రకం రూ. 4900, చాపా శనగలు రూ. 4800 మరియు
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు