ప్రభుత్వ కొనుగోళ్లుతో శనగలు పటిష్ఠం

 

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో మద్దతు ధరతో కొనుగోలుకు ఆదేశించిన తరువాత శనగల ధరలు మెరగయ్యాయి. ఈ ఏడాది ఉత్పత్తి పెరుగుతున్నందున మే నెల తరువాత ధరలు తగ్గవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఎందుకనగా ఈ ఏడాది మహారాష్ట్ర, గుజరాత్లలో సరఫరా అధికంగా ఉంది. అదే విధంగా పండుగల సీజన్లో ప్రస్తుతం కొనుగోలు చేసిన సరుకు కోసం నాఫెడ్ అమ్మకాలు ఉండగలవు.


వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ప్రస్తుత రబీలో తెలంగాణలో విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 3.42 లక్షల ఎకరాల నుండి పెరిగి 3.65 లక్షల ఎకరాలకు చేరింది. గుజరాత్లో ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 14.38 ల.ట. నుండి పెరిగి 24.90 లక్షల టన్నులకు చేరడంతో రూ. 5100 మద్దతు ధరతో రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ వారు 189 కేంద్రాలలో 4.65 ల.ట. సరుకు కొనుగోలు చేసే అవకాశం కలదు. కేంద్రం ఆంధ్రప్రదేశ్లో 2021-22 రబీ సీజన్ కోసం మద్దతు ధరతో 1,26,270 టన్నుల శనగల కొనుగోలుకు ఆమోదించింది. 

ముంబైలో టాంజానియా శనగలు రూ. 4525-4550, రష్యా కాబూలీ శనగలు రూ. 4700-4750, సూడాన్ సరుకు రూ.5050-5300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దిల్లీ లారెన్స్ రోడ్లో గత వారం 80-85 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 150 వృద్ధిచెంది రూ. 5300-5325, మధ్య ప్రదేశ్ ప్రాంతపు సరుకు రూ.5250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

గుజరాత్లోని రాజ్కోట్, గోండల్, జామ్నగర్, జునాగఢ్ ప్రాంతాలలో 28-30 వేల బస్తాల కొత్త శనగల రాబడిపై రూ. 4000-4775 P ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 150-200 వాహనాల శనగల రాబడి అవుతున్నాయి.

కర్నూలులో జెజె రకం శనగలు రూ. 4650, ఒంగోలు జెజె శనగలు రూ. 4500, కాక్-2 కాబూలీ శనగలు రూ.6300, డాలర్ శనగలు రూ. 8200మరియు కర్ణాటకలోని హుబ్లీ, ధార్వాడ్ ప్రాంతాల శనగలు రూ. 100 పెరిగి రూ. 5100-5125, గదగ్ ప్రాంతం సరుకు రూ. 5200, రాయిచూర్ సరుకు రూ. 5175 ధరతో వ్యాపారమైంది.

 కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి 25-30 వేల బస్తాల రాబడిపై స్థానికంగా రూ. 4500-4800 మరియు మహారాష్ట్ర మార్కెట్లలో 3-40 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 4600-4800, చాపా శనగలు రూ. 4750-4800 మరియు 

మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో దేశీ సరుకు రూ.5100-5150, డాలర్ శనగలు రూ. 8000-8700, కాబూలీ శనగలు 42-44 కౌంట్ రూ. 300 పెరిగి రూ. 9050, 44-46 కౌంట్ రూ. 8900, 58-60 కౌంట్ రూ. 8400, 60-62 కౌంట్ రూ. 8300, 62-64 కౌంట్ రూ. 8200, రాజస్థాన్లో 8-10 వేల బస్తాల శనగల రాబడిపె రూ. 4750, జెపూర్లో రూ. 5125-5225, పప్పు రూ. 5900 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం