నాణ్యమైన చింతపండుకు డిమాండ్ వచ్చే అవకాశం

 

దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో తీవ్రమైన ఎండల కార ణంగా సరుకు రంగు వెలుస్తున్నది. రాబోవు పండుగల సీజన్లో నాణ్యమైన రంగు సరుకులకు మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతం మహా రాష్ట్ర సరుకు గుజరాతు ఎగుమతి అవుతున్నది.


 ఆంధ్రప్రదేశ్లోని హిందూపుర్ మార్కెట్లో గతవారం 80-100 వాహనాల కొత్త చింతపండు రాబడిపై మేలిమి రకం రూ. 13,000-16,000, మీడియం రూ. 11,000 - 13,000, యా వరేజ్ రూ. 9000-10,500, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 7000-8000, మీడియం రూ. 6000-7000, యావరేజ్ రూ. 5000-6000, పుంగనూరు, మదనపల్లి ప్రాంతాలలో వారంలో 30-40 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, మేలిమి రకం రూ. 11,000-12,500, మీడియం రూ. 10,000-11,000, చపాతీ రూ. 8000-9500, ఫ్లవర్ రూ.6000-7000, మీడియం రూ. 4500-5500, యావరేజ్ రూ.4000-5000, గింజ సరుకు రూ. 2500–3000, విజయనగరం, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలలో 27-28 వాహనాల కొత్త సరుకు రాబడిపై 70 శాతం రంగు సరుకు సెమి ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 9000, మీడియం రూ. 6000, యావరేజ్ రూ. 5000 మరియు జగదల్పూర్ గింజ సరుకు రూ. 2900, లోకల్ రూ. 2600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై కాకినాడ, రాజమండ్రి కోసం మరియు మీడియం సరుకు తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. 

తెలంగాణలోని మహబూబ్నగర్ మార్కెట్లో వారంలో 4-5 వేల బస్తాల రాబడిపై రూ. 5000-8300, షాద్నగర్, నవాబ్పట్లో 700-800 బస్తాల రాబడిపై రూ. 5000-7000 ప్రతి P క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో కోహిర్, మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాల నుండి వారంలో 15-20 వాహనాల రాబ డిపై మహారాష్ట్ర, కర్ణాటక ఫ్లవర్ రకం సరుకు రూ. 5000-6500, నాణ్యమైన రంగు సరుకు రూ. 9000-10,000, కర్ణాటక నాణ్యమైన పొడవు ఫ్లవర్ రకం సరుకు రూ. 11,000-13,000 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని చింతామణిలో గురువారం నాడు 5 లారీల చింతపండు రాబడిపై మేలిమి రకం రూ. 10,000–12,000, ఫ్లవర్ రూ. 5000-8200, గింజ సరుకు రూ. 2500-3000 ధరతో వ్యాపారమె పుంగనూరు కోసం రవాణా అయింది. తుమ్కూరులో సోమ, గురువారాలలో కలిసి 80 లారీల రాబడిపై సిల్వర్ రకం రూ. 18,000-20,000, నాణ్యమైన మేలిమి రకం రూ. 12,000-13,000, మీడియం రూ. 8000-9000, ఫ్లవర్ రకం రూ. 3000–5000 మరియు బెల్గాంగ్లో 4-5 లారీల సరుకు రాబడి కాగా నాణ్యమైన ఫ్లవర్ రకం రూ. 3500-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని బార్షీలో దినసరి 800-1000, లాతూర్లో 4-5 లారీలు, ఉద్గర్లో 2-3 లారీల రాబడిపై 40-55 శాతం రంగు సరుకు రూ.8000-9000, మీడియం రూ. 5500-6500, అహ్మద్ నగర్లో 1000 బస్తాల రాబడిపై నాణ్యమైన ఫ్లవర్ రూ. 6500-7500, మీడియం రూ. 6000-6500 ధరతో వ్యాపారమె గుజరాత్ కోసం రవాణా అయింది. 

ఛత్తీస్ఘడ్లోని జగదల్పూర్లో వారంలో సుమారు 20-22 వేల బస్తాల రాబడిపై ఫ్లవర్ రకం రూ.6000-7000, గింజ సరుకు రూ. 2600-2800 లోకల్ లూజ్ మరియు ఇండోర్లో 500-600 బస్తాల రాబడిపై గింజ సరుకు రూ. 3000-3800, ఓం బ్రాండ్ రూ. 9500, మీడియం ఫ్లవర్ రూ. 6500-7000, తరానా, ఉన్హేల్లలో 1000 బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, గింజ సరుకు రూ. 3000-3500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్ కోసం రవాణా అవుతున్నది.

 తమిళనాడులోని క్రిష్ణగిరిలో గత వారం 10-12 వేల బస్తాల కొత్త చింతపండు రాబడిపై గింజ సరకు రూ.2800-3000, మీడియం రూ. 2000-2500, పాపరంపట్టి ఎసిల నుండి దినసరి 15-20 వాహనాల అమ్మ కంపై మెసూరు చపాతి రకం రూ.7400-7500, మహారాష్ట్ర సరుకు రూ. 800-8000, గింజ సరుకు రూ. 2800-2900, మైసూరు గింజ సరుకు రూ. 200 2600, కర్ణాటక బోట్ రకం రూ. 1800-1900 మరియు సేలంలో గత వారం 25-30 వాహనాలు, కంభం, ధర్మపురి, దిండిగల్ ప్రాంతాలలో 7-8 వాహనాల అమ్మకం కాగా, మేలిమి రకం సరుకు రూ. 10,000–12,000, లోకల్ చపాతీ రకం రూ. 7500-7600, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ.6500-7000, మీడియం రూ.5500-6000, గింజ సరుకు రూ.2800-3000, బోట్ రకం రూ. 1700-1800 మరియు రాంచీలో 8-10 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, గింజ సరుకు రూ. 2500-2600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై కోల్ కత్తా కోసం రవాణా అవుతున్నది.


 చింతగింజలు 


తెలంగాణలోని మహబూబ్ నగర్, నవాబ్పేట మరియు తదితర ప్రాంతాలలో దినసరి 1500 బస్తాల చింతగింజల రాబడి కాగా, రూ. 1500-1580, సిద్దిపేటలో రూ.1800 పప్పు సూరత్ డెలివరి రూ. 3125-3150 ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని హిందుపూర్ మార్కెట్లో గతవారం 15-20 వాహనాలు, పుంగనూరులో 7-8 వాహనాల కొత్త చింతగింజల రాబడిపై ధర రూ. 1700–1750, పప్పు సూరత్ డెలివరి రూ. 3150, బార్షీ డెలివరి రూ. 3000-3050, సాలూరులో 3-4 వాహనాల చింతగింజలు రాబడి కాగా రూ. 1450, పుంగనూరు డెలివరి రూ. 1600, సిద్దిపేట డెలివరి రూ. 1650 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని తుంకూరులో 10 వాహనాలు, చెల్లకేరిలో వారాంతపు సంతలో 10-11 వాహనాలు, బెల్గాంవ్లో 2-3 వాహనాల సరుకు రాబడి కాగా, స్థానికంగా రూ. 1550-1575, బార్షీ డెలివరి రూ. 1800 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని బార్షీలో 1400-1500 బస్తాల రాబడిపై రూ. 1650-1660 మరియు తమిళనాడులోని పాపరంపట్టిలో 10-15 వాహనాల రాబడిపై గింజ సరుకు రూ.1400-1500 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog