కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి, తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 2-3 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ.2500-3200, మీడియం సరుకు రూ. 1800 -2100, అక్లీన్ రూ. 1650- 1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని కలిసి వారంలో 15 వాహనాల రాగులు రాబడి కాగా, రూ.2300 2600, నవాబ్ పేట, షాద్ నగర్ ప్రాంతాలలో 200 -300 బస్తాల రాబడి కాగా, రూ.2000- 3000, విజయ నగరం, చీపురుపల్లి ప్రాంతా లలో నిల్వ అయిన సరుకు తాడేపల్లిగూడెం డెలివరి రూ. 2350, విజయనగరంలో 6-7 వాహనాల రాబడి కాగా, రూ. 2300–2600 ధరతో వ్యాపారమెంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు