లభించిన సమాచారం ప్రకారం మెసూరు కోల్డ్ స్టోరేజీలలో రూ. 3700-3800 ధరతో నిల్వ చేసిన స్టాకిస్టులు, వ్యాపారులు తమ సరుకును రూ. 4950 ధరతో విక్రయిస్తున్నారు. అయితే పెద్ద స్టాకిస్టుల అంచనా ప్రకారం రాబోవు రోజులలో ధరలు మరింత పెరిగే అవకాశం కలదు.
కర్ణాటకలోని మైసూరు, కుష్టిగి, బాగల్కట్లలో ప్రతి రోజు 4-5 వాహనాల ఉలువల రాబడిపై ధర రూ. 4500-4700, మీడియం రూ. 4000-4200, బళ్లారిలో 100-200 బస్తాలు మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో వారంలో 1-2 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, నగదు కండీషన్ రూ. 4200-4550, విజయవాడ, చల్లపల్లి డెలివరి రూ. 4700 ధరతో వ్యాపారమైంది. సాలూరు, చీపురుపల్లి ప్రాంతాలలో తెలుపు రకం సరుకు రూ. 5100-5200, నలుపు రకం రూ. 4500-4600 ధరతో వ్యాపారమె ఒడీషా కోసం ఎగుమతి అవుతోంది. కదిరి, అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గ్ ప్రాంతాలలో 4-5 లారీల రాబడిపై స్థానికంగా రూ.3900-4000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. విజయనగరంలో దినసరి 2-3 వాహనాల కొత్త సరుకు రాబడిపై తెలుపు రకం రూ.5000-5100, నలుపు రకం 4500–4600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు