తగ్గుముఖంలో శనగలు

 

వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది ఉత్పత్తి పెరగడంతోస్టాకిస్టులు ముందుకు రావడం లేదు. నాఫెడ్ శనగల కొనుగోళ్లు ఉన్నప్పటికీ, మహాహారాష్ట్ర మార్కెట్లలో రైతుల సరుకు రూ. 4300-4600 ధరతో వ్యాపార మవుతున్నది. కావున కొందరు స్టాకిస్టులు కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే సరఫరా కూడా వేగంగా పెరుగుతున్నది.2022-23 సంవత్సరం కోసం ప్రభుత్వం శనగలు, కందులు, మినుములు, పెసలు సహా అపరాల ఉత్పత్తి 10 శాతం పెంచి 295 ల.ట., నిర్ధారించడంతో పాటు ప్రస్తుత సీజన్లో ఉత్పత్తి పెరగడంతో స్టాకిస్టులు కొనుగోలు చేయడం లేదు. ఉత్పాదక కేంద్రాలలో రాబడులు పెరగడంతో గత వారం రూ. 75-100 ప్రతి క్వింటాలుకు క్షీణించింది.



బిహార్ వ్యవసాయ శాఖా వారి వివరాల ప్రకారం రబీ అపరాల విస్తీర్ణం 2020-21తో పోలిస్తే 4.39 ల.హె. పెరిగి 2021-22లో 6 ల.హె.లకు చేరింది. దీనితో నాఫెడ్ దశాబ్దం తరువాత గత నెలలో బిహార్లో రైతుల నుండి 30 వేల టన్నుల సిరిశనగ, 13 వేల టన్నుల శనగలు సహా 43 వేల టన్నుల అపరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. నాఫెడ్ వారు ఉత్పాదక రాష్ట్రాల నుండి 7.50.. సరుకు కొనుగోలు చేయగా, ఇందులో గుజరాత్ నుండి 3.40 ల.ట., మహారాష్ట్ర నుండి 3.10 ల.ట. సరుకు కొనుగోలు చేశారు గత వారం ముంబైలో టాంజానియా శనగలు రూ. 4450-4500, సూడాన్ కాబూలి శనగలు రూ. 5250-5700 మరియు దిల్లీ లారెన్స్ రోడ్ గత వారం 130-140 వాహనాల శనగల రాబడిపై రూ.75 తగ్గి రాజస్థాన్ సరుకు రూ. 5000-5025, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 4950 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ఒంగోలులో జెజె రకం సరుకు రూ. 4600, ఒంగోలులో కాక్-2 కాబూలి రకం రూ. 6600, డాలర్ శనగలు రూ. 9500 మరియు ఆంధ్రప్రాంతపు శనగలు ఈరోడ్ డెలివరి రూ. 50 తగ్గి రూ. 5000, కర్ణాటక సరుకు రూ. 5075-5100 ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని కల్బుర్గిలో 4 వేల బస్తాలు, బీజాపూర్లో 2 వేల బస్తాలు, బిదర్లో 1500 బస్తాలు, ముద్దేబిహాల్లో 1000, తాలికోట్లో 500, యాద్గిర్, సేడం, చిత్రదుర్గ్, గదగ్ ప్రాంతాలలో కలిసి 3-4 వేల బస్తాల రాబడిపై రూ. 4500-4650 మరియు మహారాష్ట్ర లోని లాతూర్ మార్కెట్లో 18-20 వేల బస్తాల సరుకు రాబడి కాగా, విజయ, అన్నిగిరి రకాలు రూ. 4600-4800, అకోలాలో 8-10 నేల బస్తాల రాబడిపై రూ.4725, సార్టెక్స్ సరుకు రూ. 6000–6100, మీడియం రూ. 5800-5900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఖామంవ్లో 4–5 వేల బస్తాలు, అమరావతిలో 4 వేల బస్తాలు, కరంజాలో 2-3 వేల బస్తాలు, దరియాపూర్లో 2 వేల బస్తాలు, జాల్నాలో 3-4 వేల బస్తాలు, ఇతర ఉత్పాదక కేంద్రాలలో 15-16 వేల బస్తాల రాబడిపై రూ. 4500 - 4550 మరియు అహ్మద్నగర్లో రూ. 4600-4700 ధరతో వ్యాపా రమైంది.


రాజస్థాన్లోని కేక్లో 1000, రామంజ్మేండీలో 2 వేలు, సుమేర్పూ ర్లో 1000, సవాయిమాధవపూర్లో 2000-2500 బస్తాలు, ఇతర ప్రాంతాలలో 10-12 వేల బస్తాల సరుకు రాబడి కాగా, రూ. 4500-4650 మరియు జైపూర్ శనగలు రూ. 5000-5050, పప్పు రూ. రూ. 5725-5750 ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని అశోక్నగర్, గంజ సోదా, కరేలి, నీమచ్, జావ్, హర్దా, దేవాస్ ప్రాంతాలలో కలిసి 20-22 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 4000-4300, నాణ్యమైన శనగలు రూ. 4700-4900, ఇండోర్ దేశీ సరుకు రూ. 4900-4925, డాలర్ శనగలు రూ. 8500-9500, కాబూలీ శనగలు 42-44 కౌంట్ రూ. 10,500, 44-46 కౌంట్ రూ. 10,300, 58-60 కౌంట్ రూ. 9300, 60-62 కౌంట్ రూ. 9200, 62-64 కౌంట్ రూ. 9100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


సిరిశనగ

ముంబైలో కెనడా నుండి దిగుమతి అయిన సిరిశనగ కంటైనర్లో రూ. 7150-7200, ఆస్ట్రేలియా సరుకు కంటైనర్లో రూ. 7225, ముంద్రా ఓడరేవు వద్ద రూ. 6800-6875, హజీరాలో రూ. 7000, కోల్కతాలో కెనడా సరుకు రూ. 7050, మరియు ఆస్ట్రేలియా సరుకు రూ. 7100-7150 ధరతో వ్యాపారమైంది. ఢిల్లీలో కెనడా సరుకు రూ. 7100, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 7000 ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని పిపరియాలో దినసరి 300-400 బస్తాల రాబడిపై రూ. 5500-6100, కరేళిలో 1000-1200 బస్తాలు, అశోక్నగర్ 1200-1500 బస్తాలు, గంజ సోదాలో 4 వేల బస్తాలు, కొలా రస్లో 2500 బస్తాలు, దామోహ్లో 2 వేల బస్తాలు, విదిశాలో 1500 బస్తాలు, బినాలో 3-4 వేల బస్తాల రాబడిపై రూ.5500-6400 మరియు ఉత్తరప్రదేశ్లోని ఉరైలో 400-500 బస్తాల రాబడిపై రూ. 6500-6800, లలి తూర్లో 3 వేల బస్తాల రాబడిపై రూ. 6250-6800, బహ్జోయి, హుజీర్ గంజ్, మోహోబా ప్రాంతాలలో 1000-1200 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000–7500, మీడియం రూ. 6000-6150, కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 6925, బరేళిలో సన్న రకం సిరిశనగ రూ. 7700, లావు రకం సరుకు రూ. 7000, బైరాయిల్లో రూ. 7900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog