బఠానీల మాదిరిగా శనగల ధరలు ఉండడంతో బెసన్ మిల్లర్ల కొనుగోళ్ళు పరిమితంగా ఉన్నాయి. ఉత్పత్తి పెరగడంతో స్టాకిస్టులు ముందుకు రావడం లేదు. ధరలు తక్కువగా ఉన్నందున రైతులు కూడ మార్కెటకు తక్కువగా సరుకు తరలిస్తున్నారు.
గత ఏడాది మాదిరిగా దీపావళి నాటికి ధరలు పెరగవచ్చునని వీరు అంచనా వేస్తున్నారు. దీనితో గతవారం ధర రూ. 150-200 ధరతగ్గి, ఉత్తరప్రదేశ్లోని ఉరైలో దినసరి 4 వేల బస్తాల ఆకుపచ్చ బఠాణీల రాబడిపై రూ. 4000-4150 మరియు 2 వేల బస్తాల తెల్ల బఠాణీలు రాబడిపై రూ.4200-4600, లాలిత్పూర్ లో 2500-3000 బస్తాల రాబడి కాగా, రూ.4100-4800, మహోబాలో ప్రతి రోజు 4-5 వేల బస్తాల కొత్త బఠానీల రాబడిపై రూ. 5000-5500, పాలీష్ రకం రూ. 5700 ధరతో వ్యాపారమై పాలీష్ సరుకు ఆంధ్ర తమిళనాడు కర్నాటకల కోసం రవణా అయింది. మరియు కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. | 4600-4800, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 4550-4750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు