మద్దతు ధరతో శనగల కొనుగోళ్లు, కాబూలి - డాలర్ ధరలు పటిష్టం
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
దేశంలోని ప్రముఖ శనగల ఉత్పాదక రాష్ట్రాలలో మద్దతు ధరతో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. హర్యాణా మార్కెట్లలో ఏప్రిల్ 1 నుండి మే 15 వరకు రూ. 5230 ధరతో కొనుగోళ్లు ఉండగలవు. రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్లో కొనుగోలు ప్రారంభమయ్యాయి. అయితే మార్కెట్లలో రాబడి అవుతున్న మొత్తం సరుకు అమ్మకం కావడం లేదు. దీనితో ఆంధ్ర మార్కెట్లలో దినసరి 40-50 లారీల సరుకు రాబడిపై కర్నూల్లో జెజె రకం శనగలు రూ. 4625, ఒంగోలు జెజె శనగలు రూ. 4500, కాక్-2 కాబూలీ శనగలు రూ. 6400, డాలర్ శనగలు రూ. 8400 మరియు ఆంధ్ర ప్రాంతం శనగలు ఈరోడ్ డెలివరి రూ. 5050, కర్ణాటక సరుకు రూ. 5100 ధరతో వ్యాపారమైంది.
ముంబైలో టాంజానియా శనగలు రూ. 4451-4475, సూడాన్ సరుకు రూ. 5050-5300 మరియు దిల్లీ లారెన్స్ రోడ్లో గత వారం 100-105 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 5175-5200, మధ్య ప్రదేశ్ ప్రాంతపు సరుకు రూ. 5100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
గత వారం డాలర్ శనగలు రూ.400-500, కాబూలి రకం రూ. 800-1000, దేశీ సరుకు రూ. 50 ప్రతి క్వింటాలుకు వృద్ధిచెందింది. ఉత్పత్తి పెరిగినందున ధరలు 5-10 శాతం కంటే ఎక్కువగా పెరిగే అవకాశం లేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో రూ. 4300-4850 మరియు మహారాష్ట్రలో రూ. 4400-4500, విజయ, అన్నిగిరి రకాలు రూ. 4875-4900, అకోలాలో పప్పు సార్టెక్స్ రకం రూ. 6000-6200, మీడియం రూ. 5700-5900, మద్యప్రదేశ్ మార్కెట్లలో రూ. 4300-4500, ఇండోర్ దేశీ సరుకు రూ.5050-5100, డాలర్ రూ.8700-9500, కాబూలి 42-44 కౌంట్ రూ. 10,250, 44-46 కౌంట్ రూ. 10,100, 58-60 కౌంట్ రూ. 9200, 60-62 కౌంట్ రూ. 9100, 62–64 కౌంట్ రూ. 9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
సిరిశనగకు గిరాకీ
విదేశాల నుండి దిగుమతులు తగ్గడంతో గత వారం ముంబైలో కెనడా నుండి దిగుమతి అయిన సిరిశనగ కంటైనర్లో రూ.250 పెరిగి రూ. 7000-7150, ఆస్ట్రేలియా సరుకు కంటైనర్లో రూ.7200, వెజిల్లో రూ. 6850, ముంద్రా ఓడరేవు వద్ద రూ. 6850, హజిరా ఓడరేవు వద్ద రూ. 7000, కోల్కతాలో కెనడా సరుకు రూ. 6950, మరియు ఆస్ట్రేలియా సరుకు రూ. 7000-7050 ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని మార్కెట్లలో రూ. 6000-6500, ఉత్తరప్రదేశ్లో రూ. 7000-7500, బరేలిలో సన్నరకం రూ. 7850-7900, లావు రకం రూ. 7100, బెర్డాయిల్లో నాణ్యమైన పాలిష్ సరుకు రూ. 8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు