తగ్గిన పత్తి ఉత్పత్తితో దిగుమతి సుంకంపై మినహాయింపు - రికార్డు స్థాయిలో పెరగనున్న పత్తి సేద్యం

 

బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 14, ఏప్రిల్ నుండి 30, సెప్టెంబర్, 2022 వరకు విదేశాల నుండి దిగుమతి అయ్యే పత్తిపై ఎలాంటి దిగుమతి సుంకం ఉండదు. కేంద్ర ఉత్పత్తులు మరియు కస్టమ్స్ సుంకం బోర్డు సిబిఐసి) వారు ఈ సందర్భంగా ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఇది వెంటన్ అమలులోకి వస్తుందని తెలిపారు.


పత్తిపై దిగుమతి సుంకం మినహాయించడం వలన నూలు, వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల తయారీదారులకు అనుకూలంగా ఉండగలదు మరియు వినియోగదారుకు ఉపశమనం లభించగలదు. అలాగే బట్టల ఎగుమతిదారులకు కూడా లాభం చేకూరగలదు. పంజాబ్లో పత్తి విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 20-25 శాతం పెరిగి 4లక్షల హెక్టార్లను దాటే అవకాశం కలదు. ఎందుకనగా, ఈ ఏడాది భారత్తో పాటు ప్రపంచ స్థాయిలో ఉత్పత్తి తగ్గింది. దేశంలోని రైతులకు మద్దతు ధరతో పోలిస్తే మార్కెట్లో 40-50 శాతం అధిక ధర లభిస్తున్నది. భారతీయ పత్తి సంఘం (సిసిఐ) వారు రెండవసారి పత్తి ఉత్పత్తిలో తగ్గుదల అంచనా వేశారు. ఎందుకనగా, ప్రముఖ పత్తి ఉత్పాదక రాష్ట్రాలైన గుజరాత్, తెలంగాణా, మహారాష్ట్ర మరియు కర్నాటకలలో ఉత్పత్తి తగ్గడంతో 2021-22 ( అక్టోబర్ - సెప్టెంబర్ ) కోసం దేశంలో పత్తి ఉత్పత్తి ముందు అంచనా 343.13 లక్షల బేళ్లతో పోలిస్తే 8 లక్షల బేళ్లు తగ్గించి 335.13 లక్షల బేళ్లు ( ప్రతి బేలు 170 కిలోలు ) అంచనా వేయడం జరిగింది. సి ఎ ఐ వారి వివరాల ప్రకారం 31, మార్చి, 2022 వరకు 80 శాతం పత్తి రాబడి అయింది.


అక్టోబర్ నుండి 31, మార్చి, 2022 వరకు దేశీయ వినియోగం 175 లక్షల బేళ్లు ఉండే అంచనా కలదు. అయితే, ఎగుమతులు 35 లక్షల బేళ్లు ఉన్నాయి. మొత్తం సీజన్లో ఎగుమతులు 45 లక్షల బేళ్లు ఉండే అవకాశం కలదు. 2021-22 లో పత్తి దిగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే 5 లక్షల బేళ్లు పెరిగి 15 లక్షల బేళ్లకు చేరే అంచనా కలదు. ఇందులో సిఎఐ వారి రికార్డుల ప్రకారం 31, మార్చి, 2022 వరకు 6 లక్షల బేళ్ల సరుకు ఓడరేవులకు చేరింది. సిఎఐ కథనం ప్రకారం 8 లక్షల బేళ్ల లోటులో గుజరాత్ మరియు తెలంగాణాలలో 2 లక్షల బేళ్ల చొప్పున మరియు మహారాష్ట్రలో 1 లక్ష బేళ్ల ఉత్పత్తి తగ్గే అంచనా కలదు. అయితే, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సాలలో ఉత్పత్తి కొంతమేర తగ్గే అంచనా కలదు.


సిఎఐ వారి వివరాల ప్రకారం అక్టోబర్ నుండి మార్చి, 2022 వరకు దేశంలో రాబడులు 262 లక్షల బేళ్లు ఉన్నాయి. అయితే, 31 మార్చి, 2022 వరకు దిగుమతులు మరియు మిగులు నిల్వలు కలిసి మొత్తం 343.63 లక్షల బేళ్ల సరుకు లభ్యత ఉంది. మార్చి, 2022 వరకు బట్టల మిల్లుల వద్ద 75 లక్షల బేళ్లు మరియు సిసిఐ మరియు మహారాష్ట్ర ఫెడరేషన్, బహుళజాతి కంపెనీలు, వ్యాపారులు, జిన్నర్స్, ఎంసిఎక్స్ మొదలగు వారి వద్ద 58.68 లక్షల బేళ్లు కలిసి మొత్తం 133 లక్షల బేళ్ల నిల్వలు ఉన్నట్లు అంచనా.


సిఐఎ వారి వివరాల ప్రకారం ప్రస్తుత సీజన్ చివరి నాటికి అనగా, 30, సెప్టెంబర్, 2022 నాటికి నిల్వలు 40.13 లక్షల బేళ్లు ఉండే అంచనా కలదు. పత్తి ఉత్పత్తి మరియు నిల్వలు తగ్గినందున, 9, ఏప్రిల్, 2022 న జిన్నింగ్ పత్తి ధర రూ. 91,500 ప్రతికండీ ( 356 కిలోలు ) చేరింది. అనగా, 9, ఏప్రిల్, 202 ఉన్న ధర రూ. 45,600 తో పోలిస్తే పై ధర రెట్టింపు ఉంది.

Comments

Popular posts from this blog