వ్యాపారస్తుల కథనం ప్రకారం గత గురువారం నుండి నిజామాబాద్, వరంగల్ మొదలగు మార్కెట్లు మూసిఉండడంతో సోమవారం భారీగా సరుకు రాబడి అయ్యే అవకాశం కలదు. ఏప్రిల్ వాయిదా దాదాపు సమాప్తమయింది. దీనితో పసుపు చివరి మందకొడి సోమవారం నుండి బుధవారం వరకు ఉండగలదు దీని తరువాత ధరలు హెచ్చుముఖం పట్టే అవకాశం కలదు. ఎందుకనగా స్పెక్యులేటర్స్ మే-జూన్ వాయిదా కొనుగోలు చేయడంపై దృష్టిసారిస్తున్నారు. సోమవారం 12 గం.ల తరువాత మార్కెట్ మరియు వాయిదా ధరల పరిస్థితిపై ధరలు తగ్గితే, కొనుగోలు చేయడం భవిష్యత్తులో లాభదాయకంగా ఉండగలదు. ఎందుకనగా పసుపు ఏప్రిల్ వాయిదా సెటిల్మెంట్తో పాటు ఆహార ధాన్యాలు మరియు అపరాల వ్యాపారులు కూడా ఈ ఏడాది పసుపు, ధనియాలు, జీలకర్రలపై మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా రైతులు కూడా ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకుని పంట కోతలతో పాటు విత్తనాలు ఎక్కువగా నిల్వ చేసే అవకాశం కలదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే 2023లో సమృద్ధిగా ఉత్పత్తికి అవకాశం కలదు.
ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 9408 తో ప్రారంభమైన తర్వాత బుధవారం వరకు రూ. 248 క్షీణించి రూ. 9160, మే వాయిదా రూ. 346 తగ్గి రూ. 9180 వద్ద ముగిసింది.
నిజామాబాద్ మార్కెట్లో గత వారం 35-36 వేల బస్తాల కొత్త పసుపు రాబడి కాగా కొమ్ములు రూ. 6500-8800, గోలా రకం రూ. 5800-7400, పాలిష్ కొమ్ములు రూ. 8900-9000, గోళా రకం రూ.7300-7400 మరియు మెట్పల్లిలో సోమవారం నుండి బుధవారం వరకు 4-5 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, కొమ్ములు రూ.4500-8000, గోళా రకం రూ. 5700-6800 మరియు వరంగల్లో 800-1000 బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 4400-7000, గోళా రకం రూ. 4000-6600, కేసముద్రంలో 4500 బస్తాల రాబడిపై నాణ్యమైన కొమ్ములు రూ. 7100-7200 మరియు గోళా రకం రూ. 6600-6700, హైబ్రీడ్ కొమ్ములు రూ. 6400 - 6500, గోలా రకం రూ.6100-6200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాల మార్కెట్లో సోమ వారం నుండి బుధవారం వరకు 2 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా కొమ్ములు, గోళా రకాలు రూ.6400-6700, సేలం రకం రూ.6900-7000 మరియు కడప మార్కెట్లో 6-7 వేల బస్తాల సరుకు రాబడి కాగా, కొమ్ములు రూ. 7000-7100, గోళా రకం రూ. 6000-6100, నిమ్ము సరుకు రూ. | 4000 - 4300 ధరతో వ్యాపారమైంది.
మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో గత వారం 40-50 వేల బస్తాల సరుకు రాబడిపై రాజాపురి రకం రూ. 8000-9500, దేశీ కడప రకం పసుపు రూ.7200-7500 మరియు హింగోళిలో సోమవారం నుండి బుధవారం వరకు 28-30 వేల బస్తాల రాబడి కాగా, కొమ్ములు రూ. 7400-8400, గోళా రకం రూ.6700-7400, నాందేడ్లో 15 వేల బస్తాలు, బస్మత్నగర్లో 1800-2000 బస్తాల సరుకు రాబడి కాగా, రూ. 7000-8600, గోళా రకం రూ. 6500-7300 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత సోమారం నుండి బుధవారం వరకు 24-25 వేల బస్తాల సరుకు రాబడి కాగా కొమ్ములు కొత్త సరుకు రూ. 6599-8409, గోళా రకం రూ.6249 | 7489, పెరుందురైలో 4-5వేల బస్తాల రాబడి కాగా, కొమ్ములు రూ. 6500 8619, గోలా రూ. 6169-7499, పాత కొమ్ములు రూ. 5989-7806, గోళా రకం రూ. 5369 -7169 ధరతో వ్యాపారం అయింది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు