క్షీణించిన జీలకర్ర వాయిదా ధరలు

 


వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది జీలకర్ర ఉత్పత్తి తగ్గడంతో మరియు ధరలు పెరగడంతో స్టాకిస్టులు మరియు కిరాణా వ్యాపా రులు నిరవధికంగా కొనుగోలు చేస్తున్నందున వారంలో గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి 1 లక్ష బస్తాలకు పైగా మరియు రాజస్థాన్లో 50 వేల బస్తా లకు పైగా జీలకర్ర రాబడిపై 90 శాతం సరుకు అమ్మకం అయింది. దీనితో మే నెల వరకు ధరలు తగ్గకుంటే మరియు ఎగుమతి డిమాండ్ పెరిగితే ప్రతికిలోకు కనీసం రూ. 20 పెరుగుదలకు అవకాశం ఉంది. నాణ్యమైన సూపర్ ఫైన్ మషీన్ క్లీన్ సరుకు గరిష్టంగా రూ.30,000 వరకు చేరవచ్చు. అయితే సెప్టెంబర్ తరు వాత స్టాకిస్టుల అమ్మకాలతో పెరుగుదలకు అడ్డుకట్ట పడవచ్చు.


గత వారం ఎన్సిడిఇఎక్స్ వద్ద జీలకర్ర ఏప్రిల్ వాయిదా రూ. 22,200 తో ప్రారంభమై బుధవారం నాటికి రూ. 350 క్షీణించి రూ. 21,850, మే వాయిదా రూ. 22,425తో ప్రారంభమై శుక్రవారం వరకు రూ.55 తగ్గి రూ.22,370 వద్ద ముగిసింది. మరియు జూన్ వాయిదా శుక్రవారం నాడు రూ. 22,870తో ప్రారంభమైన తరువాత సాయంకాలం వరకు రూ. 290 క్షీణించి రూ. 22,580 వద్ద ముగిసింది.

 గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో గత వారం 80-85 వేల బస్తాల కొత్త జీలకర్ర రాబడిపై యావరేజ్ సరుకు రూ. 14,000-15,000, మీడియం రూ. 19,000-19,200, నాణ్యమైన సరుకు రూ. 20,000-21,000, మిషన్ క్లీన్ రూ.23,500-24,750 మరియు రాజ్కోట్లో 7-8 వేల బస్తాలు, గోండల్లో 6-7 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై మీడియం రూ. 19,250-19,750, యూరప్ రకం రూ. 20,250-20,750, కిరాణా రకం రూ. 21,250, జామ్నగర్లో 5-6 వేల బస్తాలు, జామ్ధ్ూర్లో 4 వేల బస్తాల రాబడి కాగా, మీడియం రూ. 17,000–17,600, నాణ్యమైన సరుకు రూ. 20,000-20,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 రాజస్థాన్లోని మెడతాలో గత వారం 20-22 వేల బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 14,000-15,000, మీడియం రూ. 17,500–18,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-20,000, సూపర్ ఫైన్ రూ. 21,000-23,500, ఫలోదిలో 7-8 వేల బస్తాల రాబడిపై రూ. 17500-19,500, కేక్ లో రూ. 18,000-20,500, నోఖాలో 4-5 వేల బస్తాల రాబడిపై రూ. 18,000-20,000, జోధ్పూర్లో 4-5 వేల బస్తాల రాబడిపై మీడియం రూ. 17,500-18,500, నాణ్యమైన సరుకు రూ. 21,000-22,000, నాగోర్ 5-6 వేల బస్తాల రాబడిపై రూ. 20,000–24,000, కిషన్డ్లో రూ. 18,000-19000, నాణ్యమైన సరుకు రూ. 21,000-22,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog