కొనసాగుతున్న పసుపు రాబడులు - గిరాకీ లేక మందకొడిగా ధరలు

 

గత వారం ఎన్సిడిఇఎక్స్ వద్ద ఏప్రిల్ వాయిదా రూ. 8830 వద్ద ముగిసింది. సోమవారం నాడు మే వాయిదా రూ. 9122తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 146 క్షీణించి రూ. 8976, జూనావాయిదా శుక్రవారం నాడు రూ. 9176తో ప్రారంభమైన తరువాత సాయంత్రం వరకు రూ. 88 తగ్గి రూ. 9088 వద్ద ముగిసింది.ఆంధ్ర, మహారాష్ట్రలలో రాబడులు పెరగడంతో దేశంలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 3 లక్షల బస్తాల రాబడి కారణంగా మర ఆడించే యూనిట్ల కొనుగోల్లు తగ్గడంతో మరియు ఎగుమతులు సాధారణ స్థాయిలో ఉన్నందున ధరలు మంద కొడిగా మారాయి. 


ఈ ఏడాది పంట విత్తిన తరువాత భారీ వర్షాల వలన కొన్ని రాష్ట్రాలలో పంటకు నష్టం వాటిల్లింది. ప్రస్తుత సీజన్లో ప్రారంభ నిల్వలు గత ఏడాదితో పోలిస్తే 25 లక్షల బస్తాలు (ప్రతి బస్తా 50 కిలోలు) నుండి తగ్గి 17 - 18 లక్షల బస్తాలకు చేరడం వలన కూడా ధరలు పటిష్టంగా మారేందుకు అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు మనదేశం నుండి పసుపు ఎగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 20 శాతం తగ్గి 1.37 ల.ట.లకు చేరాయి. అయితే గత 5 సంవత్సరాల సగటు ఎగుమతులతో పోలిస్తే 8.3 శాతం అధికంగా ఉన్నాయి.


వ్యవసాయ శాఖ వారి ముందస్తు అంచనా ప్రకారం 2021-22లో దేశంలో పసుపు ఉత్పత్తి ముందు సంవ త్సరంతో పోలిస్తే 11.24 ల.ట. నుండి పెరిగి 11.76 ల.ట.లకు చేరే అంచనా కలదు. మసాలా బోర్డు వారి అంచనా ప్రకారం తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడు, అస్సాం, హర్యాణలలో ఉత్పత్తి ప్రభావితమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 11.78 ల.ట. నుండి తగ్గి 11.01 ల.ట.లకు చేరే అంచనా కలదు.


ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం జనవరి 2022లో ఎగుమతులు డిసెంబర్ 2021తో పోలిస్తే 14,275 టన్నుల నుండి 25 శాతం తగ్గి 10,600 టన్నులకు, ఫిబ్రవరిలో గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12,575 టన్నుల నుండి 17 శాతం తగ్గి 10,400 టన్నులకు చేరాయి.


నిజామాబాద్ మార్కెట్లో గత వారం 55 వేల బస్తాల కొత్త పసుపు రాబడికాగా కొమ్ములు రూ. 6500-8500, గోలా రకం రూ.6000-7000, పాలిష్ కొమ్ములు రూ.8800 -9000, గోళా రకం రూ. 7700 7800 మరియు మెట్పల్లిలో 7-8 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, కొమ్ములు రూ.6400-7500, గోళా రకం రూ. 5500-6200 మరియు వరంగల్లో 4-5 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 7000 - 7100, గోళా రకం రూ. 6500 6700, కేసముద్రంలో 5-6 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 6000 - 7300, మరియు గోళా రకం రూ. 5200-6200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్ లోని దుగ్గిరాల మార్కెట్లో గతవారం 4 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా కొమ్ములు, గోళా రకాలు రూ.6200-6500, సేలం రకం రూ.6500-6700 మరియు కడప ప్రాంతం నుండి గత వారం 3-4 వాహనాల సరుకు రాబడి కాగా, కొమ్ములు, గోళా రకం రూ. 6400-6500, మరియు కడప మార్కెట్లో వారంలో 10-12 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 6700-6800, గోలా రకం రూ. 5700 - 5800, నిమ్ము సరుకు రూ. 4000 - 4200 ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో గత వారం 40-45 వేల బస్తాల సరుకు రాబడిపై రాజాపురి రకం రూ. 8000-9500, దేశీ కడప రకం పసుపు రూ.6500-7500 మరియు హింగోళిలో సోమ, బుధవారాలలో కలిసి 45-50 వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ.7000- 8000, గోలా రకం రూ. 6500- 7400, నాందేడ్ 18-20 వేల బస్తాలు, బస్మత్నగర్లో 30-35 4 వేల బస్తాల సరుకు రాబడి కాగా, రూ. 7000- 8200, గోళా రకం రూ. 6500 -7500 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. 

తమిళనాడులోని - ఈరోడ్ మార్కెట్లో గత సోమవారం నుండి బుధవారం వరకు 30-32 వేల బస్తాల రాబడిపై కొత్త కొమ్ములు రూ. 6309-8356, గోళా రకం రూ. 5899-7575, పెరుందురైలో 4-5 వేల బస్తాల రాబడిపై కొత్త కొమ్ములు రూ. 6435 - 8399, గోళా రకం రూ. 5962- 7399, పాత కొమ్ములు రూ.5657-7631, ' గోళా రూ. 5306-6191 ధరతో వ్యాపారం అయింది.

Comments

Popular posts from this blog