భారీగా పెరుగుతున్న శనగల రాబడులు - కొనసాగుతున్న నాఫెడ్ కొనుగోళ్లు

 

రాజస్థాన్, మధ్య ప్రదేశ్, హర్యాణా లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వం కనీస మద్దతు ధరతో శనగల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. నాఫెడ్ వారు ద్వారా. గత వారం గుజరాత్లో 2,25,262 టన్నులు, మహారాష్ట్రలో 1,87,271 టన్నులు, కర్ణాటకలో 44,806 టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 15,077 టన్నులతో పాటు దేశంలోని అన్ని ఉత్పాదక కేంద్రాల నుండి సుమారు 4,72,416 టన్నుల సరుకు కొనుగోలు చేశారు. ఎందుకనగా మార్కెట్లలో రైతుల సరుకు మద్దతు ధరలకంటే తక్కువ ధరతో అమ్మకం అవుతున్నది.


వ్యాపారస్తుల కథనం ప్రకారం ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో 1 కోటి 14 లక్షల టన్నుల ఉత్పత్తి మరియు గత ఏడాది మిగులు నిల్వలు సుమారు 20 లక్షల టన్నులతో సహా 1 కోటి 34 లక్షల టన్నుల లభ్యతతో పోలిస్తే భారత దేశ స్థానిక వినియోగం 90 లక్షల టన్నులు మించి ఉండదు. ఇలాంటి పరిస్థితులలో ధరలు పెరగవు. ఎందుకనగా ధరలు పెరిగే సమయంలో నాఫెడ్ వారి శనగల అమ్మకాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దేశంలో వివాహాది శుభకార్యముల కోసం డిమాండ్ నెలకొనడంతో శనగల ధర రూ. 50-100 ప్రతి క్వింటాలుకు వృద్ధిచెంది 

ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి ప్రతి రోజు 50-60 వాహనాల శనగలు రాబడి కాగా, కర్నూలులో జెజె రకం సరుకు రూ. 4700, ఒంగోలులో రూ. 4600, కాక్-2 కాబూలి రకం రూ. 7100, డాలర శనగలు రూ.9000 మరియు ఒంగోలు, చిలకలూరిపేట ప్రాంతాల జేజే శనగలు ఈరోడ్ డెలివరి రూ. 5000–5050, కర్ణాటక సరుకు రూ. 5125-5150 ధరతో వ్యాపారమైంది.


ముంబైలో టాంజానియా శనగలు రూ. 4600, సూడాన్ కాబూలి శనగలు రూ.200 వృద్ధిచెంది రూ.5250-5350, కొత్త సీజన్ సరుకు రూ. 5500-5700 మరియు దిల్లీ లారెన్స్ రోడ్లో గత వారం 180–185 వాహనాల శనగల రాబడిపై రూ. 5075-5175 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 కర్ణాటకలోని కల్బుర్గిలో 3-4 వేల బస్తాలు, బీజాపూర్లో 2 వేల బస్తాలు, ముద్దేబిహాల్, సిందగి, అల్మేల్, బిదర్, భాల్కీ ప్రాంతాల మార్కెట్లలో కలిసి 7-8 వేల బస్తాల రాబడిపై రూ. 4500-4775 మరియు

 మహారాష్ట్ర లోని లాతూర్ మార్కెట్లో 25-30 వేల బస్తాల సరుకు రాబడి కాగా, రూ. 4800-5125, ఇతర మార్కెట్లలో రూ. 4500-4650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మధ్య ప్రదేశ్లోని పిపరియా, అశోక్నగర్, నీమచ్, జావ్, దామోహ్, కరేళి ప్రాంతాలలో ప్రతి రోజు 35-40 వేల బస్తాల సరుకు రాబడి కాగా, రూ. 4400-800, కాబూలి శనగలు రూ.9000-9500, దామ్నోద్లో 8-10 వేల బస్తాల రాబడి కాగా రూ. 9500-10,200 మరియు ఇండోర్ దేశీ సరుకు రూ. 5150, డాలర్ శనగలు రూ. 9000-10,000, కాబూలీ శనగలు 42-44 కౌంట్ రూ. 400 పెరిగి రూ. 10600-10700, 44-46 కౌంట్ రూ. 10400-10500, 58-60 కౌంట్ రూ. 9400-9500, 60-62 కౌంట్ రూ. 9300-9400, 62-64 కౌంట్ రూ.9200-9300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 రాజస్థాన్లోని రామ్ంజ్మండి, కేక్, బికానేర్, సుమేర్పూర్, సవాయ్ మాధవపూర్ ప్రాంతాలలో 18-20 వేల బస్తాల సరుకు రాబడి కాగా, రూ. 4600-4800 మరియు జైపూర్లో శనగలు రూ.5125-5150, పప్పు రూ. రూ. 5900 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతి రోజు 25 వేల బస్తాల సరుకు రాబడి కాగా రూ. 4400-4700, జామ్నగర్లో 4-5 వేల బస్తాలు రాబడి కాగా, రూ. 4000-5600, గోండల్లో 4 వేల బస్తాల రాబడిపై రూ. 4450-4700, జూనాఘడ్లో 1500-2000 బస్తాల రాబడిపై రూ. 4500-5500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.





    సిరిశనగ పటిష్టం


రంజాన్ పండుగ కోసం గిరాకీ నెలకొనడంతో పాటు విదేశీ సిరిశనగ ధరలు బలోపేతం చెందినందున ముంబైలో కెనడా నుండి దిగుమతి అయిన సిరిశనగ కంటైనర్లో రూ. 175 పెరిగి రూ. 7300, ఆస్ట్రేలియా సరుకు కంటైనర్లో రూ. 7350, ముంద్రా ఓడరేవు వద్ద రూ. 6975-7000, కోల్కతాలో కెనడా సరుకు రూ. 7100, మరియు ఆస్ట్రేలియా సరుకు రూ.7200 ధరతో వ్యాపారమైంది.మధ్య ప్రదేశ్ లోని అశోక్ నగర్, గునా, సాగర్, దామోహ్, ఖొరై, విదిశా ప్రాంతాలలో సుమారు 15-20 వేల బస్తాల రాబడిపై రూ.6000-6400 మరియు ఉత్తర ప్రదేశ్లోని ఝాన్సీ, మోట్, లిలిత్పూర్ ప్రాంతాలలో రూ. 7200–7600, బరేళిలో సన్న రకం సిరిశనగ రూ. 7700, లావు రకం సరుకు రూ. 7150, బైరాయిచ్లో రూ. 7900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం