పెరిగిన శనగల రాబడులు- ధరలు స్థిరం

 

దేశంలోని ప్రముఖ ఉద్పాదక రాష్ట్రలలో చిన్న మరియు మధ్య తరగతి రైతుల సరుకు భారీగా రాబడి అవుతున్నందున ధరలు పెరగడంలేదు . సీజన్ ప్రారంభం నుండే మిల్లర్లు అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు రూ. 100-150 హెచ్చుతగ్గులూ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాలలోని పెద్ద వ్యాపారస్తులు ధరలుతక్కవగా ఉన్నందున సరుకు నిల్వ చేస్తూన్నారు.


 ఈ సరుకు ఆగస్టు తరువాత అమ్మకం కాగలదు. దీనితోపాటు నాఫెడ్ కూడ జూన్ వరకు కొనుగోలు చేసి దీపావళి నాటికి లేదా డిసెంబర్లో సరుకు విక్రయించే అవకాశం ఉంది. ఒకవేళ ఈసారి వర్షాలు అనుకూలంగా లేకుంటే ఖరీఫ్ సీజన్ అపరాల సాగు ప్రభావితం అయితే ధరలలో రూ. 300-400 హెచ్చు తగ్గులు ఉండగలవు. ప్రస్తుతం ప్రముఖ శనగల ఉత్పాదక రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక మరియు ఆంధ్ర మార్కెట్లలలో ధరలు సమానంగా ఉండడంతో మార్కెట్లకు రాబడి అయిన సరుకు మిల్లర్లు కొనుగోలు చేసి పప్పును ఇతర రాష్ట్రలకు ఎగుమతులు చేస్తూన్నారు . ఇందులో పోటీ కారణంగా పప్పు నెమ్మదిగా అమ్మకం అవుతున్నది.


కర్నూలులో జెజె రకం సరుకు రూ. 4650, ఒంగోలులో రూ. 4600, కాక్-2 రకం రూ. 6900, డాలర శనగలు రూ. 9300 ధరతో వ్యాపారం కాగా ఆంధ్ర ప్రాతం శనగలు ఈరోడ్ డెలివరి రూ.5050, కర్ణాటక సరుకు రూ. 5125 ధరతో వ్యాపారమైంది. ముంబైలో టాంజానియా శనగలు రూ. 100 పెరిగి రూ. 4555, సూడాన్ కాబూలి శనగలు రూ.5250-5300, మరియు దిల్లీ లారెన్స్ రోడ్ గత వారం 130-140 వాహనాల శనగల రాబడిపై రాజస్థాన్ సరుకు రూ. 100 తగ్గి రూ. 5075-5100, మధ్య ప్రదేశ్ సరుకు రూ.5050 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 కర్ణాటకలోని కల్బుర్గిలో 2500-3000 బస్తాలు, బీజాపూర్లో 2 వేల బస్తాలు, ముద్దేబిహాల్ 1000 బస్తాలు, బిదర్లో 1500బస్తాలు, తాలికోటలో 300-400 బస్తాలు, యాదగిర్, సేడం, చిత్రదుర్గ, గదగ్ ప్రాంతాలలో కలిపి 2-3 వేల బస్తాల రాబడిపై రూ. 4600-4650 మరియు మహారాష్ట్ర లోని లాతూర్ మార్కెట్లో 18-20 వేల బస్తాల సరుకు రాబడి విజయ అన్నగిరి రూ. 4600-4900, అకోలా లో 8-10 వేల బస్తాల రాబడిపై రూ. 4825, కామ్ వ్ లో 3-4 వేల బస్తాలు అమరావతిలో 3వేల బస్తాలు కరంజాలో 2-3 వేల బస్తాలు దరియాపూర్ లో 2 వేల బస్తాలు జాల్నాలో 3-4 వేల బస్తాలు మరియు ఇతర ఉత్పాదక కేంద్రాలలో 10-12 వేల బస్తాల రాబడిపై రూ. 4500-4600, అహమ్మద్నగర్ రూ.4600 - 4800 ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని పిపరియాలో దినసరి 7-8 వేలబస్తాలు, అశోక్ నగర్ 1000-1500బస్తాలు, గంజ సోదాలో 2-3 వేల బస్తాలు నీమల్లో 1000-1200, జామ్రా 1500, హరదాలో 5-6 వేల బస్తాలు దేవాస్లో 2000-2500, కరేళిలో 2 వేల బస్తాల రాబడిపై రూ.4350-4550, నాణ్యమైన సరుకు రూ. 4600-50000, మరియు ఇండోర్ దేశీ సరుకు రూ. 5050-5100, డాలర్ శనగలు రూ. 9000-10,000, కాబూలీ శనగలు 42-44 కౌంట్ రూ. 10200-10300, 44-46 కౌంట్ రూ. 10000-10100, 58-60 కౌంట్ రూ. 9000-9100, 60-62 కౌంట్ రూ. 8900-9000, 62-64 కౌంట్ రూ.8800-8900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

రాజస్థాన్లోని రామంజ్మండిలో 2 వేలు, కేక్ట్లో దినసరి 1000 బస్తాలు, సుమేర్పూర్లో 2 వేలు, సవాయ్ మాధవ్ పూర్ ప్రాంతాలలో 2000-2500 బస్తాల దారియాపూర్ లో 2వేలు జాల్నాలో 3-4 వేల బస్తాలు మరియు ఇతర ఉత్పాదక కేంద్రాలలో 10-12 వేల బస్తాల సరుకు రాబడి కాగా, రూ. 4500-4600, అహమ్మద్ నగర్ లో రూ. 4600-4800 ధరతో వ్యాపారం జరిగింది.




సిరిశనగ పటిష్టం


 ముంబైలో కెనడా నుండి దిగుమతి అయిన సిరిశనగ కంటైనర్ రూ. 300 పెరిగి రూ. 7200, ఆస్ట్రేలియా సరుకు కంటైనర్లో రూ. 7250, ముంద్రా ఓడరేవు వద్ద రూ. 6825-6900, హజీరా ఓడరేవు వద్ద రూ. 7050, కోల్కతాలో కెనడా సరుకు రూ. 7000-7050, మరియు ఆస్ట్రేలియా సరుకు రూ.70 వ్యాపారం కావడంతో దేశీయ మార్కెట్లో ధర రూ. 250-300 ప్రతి క్వింటాలుకు పెరిగింది. మధ్య ప్రదేశ్లోని పిపరియా లో దినసరి 400-500 బస్తాల రాబడి పై రూ. 5500-6150, అశోక్ నగర్ లో 1200-1500 ,గంజిబసోదాలో 4-5వేల బస్తాలు, దామోహ్లో 2-3 వేల బస్తాలు విదిశాలో 2 వేల బస్తాలు బినాలో 4-5 వేల బస్తాల రాబడిపై రూ. 6000-6500 ధరతో క్వాలిటీ ప్రాకరం వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని లిలిత్పూర్లో దినసరి 2500 3000 బస్తాల రాబడిపై రూ.6100-6900, బహజోహి మరియు మహుబా ప్రాంతాలలో కలిపి 800-1000 బస్తాల రాబడిపై రూ. 7000–7500, మరియు మధ్య ప్రదేశ్ ప్రాంతం సరుకు రూ. 7125-7175, రకం సిరిశనగ రూ. 7600, లావు రకం సరుకు రూ.7100, బైరాయిచ్లో రూ. 7800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog