చురుకుగా చింతపండు స్టాకిస్టులు

  


లభించిన సమాచారం ప్రకారం మహారాష్ట్రలోని ఉత్పాదక కేంద్రాలలో వేసవితాపంతో సరుకు రంగు తగ్గింది. అయితే ఈ ఏడాది మహారాష్ట్ర లో ధరలు తక్కువగా ఉండడంతో 40 శాతం సరుకు మాత్రమే శీతల గిడ్డంగులలో నిల్వలు జరిగాయి. రాబోవు పదిహేను రోజులలో రాబడులు సమాప్తం అయ్యే అవకాశం కలదు. ఈ ఏడాది చింతపండు నిల్వ చేసేవారికి లాభం చేకూరే అవకాశం కలదు. ఎందుకనగా గత ఏడాది సరుకు రూ. 10,000 ధరలేదా అంతకంటే ధర అధికంగా ఉంది. అయితే ఈ ఏడాది రూ. 7,500- 8,500 ధరతో నిల్వలు చేసిన సరుకు రూ. 10,000 ధరతో సులభంగా అమ్మకం అయ్యే అవకాశం కలదు.


ఆంధ్రప్రదేశ్ లోని హిందూపుర్ మార్కెట్లో గతవారం 80-100 వాహనాల కొత్త చింతపండు రాబడిపై సిల్వర్ రకం రూ. 16,000-24,000, మేలిమి రకం రూ. 12,000-16,000, మీడియం రూ. 9,000 - 11,500, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 6000-7500, మీడియం రూ.5000-6000, యావరేజ్ రూ. 4500-5000, రాయదుర్గి 2-3 వాహనాలు, పుంగనూరు, మదనపల్లి ప్రాంతాలలో వారంలో 50-60 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, మేలిమి రకం రూ. 11,000-12,500, మీడియం రూ. 10,000–11,000, చపాతీ రూ.8000-9,500, ఫ్లవర్ రూ. 6000-7000, మీడియం రూ. 4500-5500, యావరేజ్ రూ.4000-5000, గింజ సరుకు రూ. 2500–3000, విజయనగరం, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలలో 30-35 వాహనాలు కొత్త సరుకు రాబడిపై సెమి ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై రాజమండ్రి కోసం రవాణా అవుతున్నది. మరియు మీడియం సరుకు రూ. 6,000, యావరేజ్ రూ. 5100, నాణ్యమైన గింజ సరుకు రూ. 3000-3050, మీడియం రూ.2500-2600, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తెలంగాణలోని మహబూబ్ నగర్ మార్కెట్లో 1000 బస్తాల రాబడిపై రూ. 4200-8300, షాద్ నగర్ లో 200-300 బస్తాలు, నవాబ్పేట్లో 400 బస్తాల రాబడిపై రూ. 5000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. వ్యాపారస్తుల అభిప్రాయం ప్రకారం హైదరాబాద్లో శీతలగిడ్డంగులలో 500-550 లారీలు పాత సరుకు, కొత్త సరుకు 700 లారీలు నిల్వలు ఉన్నట్లు అభిప్రాయ పడుతున్నారు. సీజన్ మొత్తంలో నిల్వలు 1500-1600 లారీలకు చేరే అవకాశం కలదు. కోహిర్, మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాల నుండి వారంలో 25-30 వాహనాలు, మహారాష్ట్ర నుండి 7-8 వాహనాల రాబడి కాగా, ఫ్లవర్ రకం సరుకు రూ. 5000-6000, నాణ్యమైన సరుకు 9,000-10,000 కర్ణాటక సరుకు రూ. 5500-6500, నాణ్యమైన రంగు సరుకు రూ. 14,000-15,000, మేలిమిరకం రూ. 12,00013,000, ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని చింతామణిలో గురువారం నాడు 7 లారీల చింతపండు రాబడిపై మేలిమి రకం రూ. 10,000-12,000, ఫ్లవర్ రూ. 6500-7000, మీడియం ఫ్లవర్ రూ. 4000-5500, గింజ సరుకు రూ. 2500-3000 ధరతో వ్యాపారమె పుంగనూరు కోసం రవాణా అయింది. తుమ్కూరులో సోమ, గురువారాలలో కలిసి 30 లారీల రాబడిపై సిల్వర్ రకం రూ. 20,000–25,000, నాణ్యమైన మేలిమి రకం రూ. 15,000-17,000, మీడియం రూ. 8500-9000, ఫ్లవర్ రకం రూ. 4000-4200, బోట్ రకం రూ. 1500-1600 మరియు బెల్గాంవ్లో బుధవారం నాడు 6-7 లారీల సరుకు రాబడి కాగా నాణ్యమైన ఫ్లవర్ రకం రూ. 8,000-10,000, మీడియం రూ. 4000-6500, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని బారీలో దినసరి 1000-1200 బస్తాలు లాతూర్ లో 4-5 లారీలు, ఉద్దీర్ 2-3 వాహనాలు రాబడి పై నాణ్యమైన సరుకు 6500 - 7500, మరియు అహ్మద్ నగర్ లో 1000 బస్తాల రాబడిపై నాణ్యమైన ఫ్లవర్ రూ. 7000-8000, మీడియం రూ. 6000-7000 ధరతో వ్యాపారమె గుజరాత్ కోసం రవాణా అయింది. ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్లో దాదాపు 20-25 వాహనాల సరుకు రాబడి కాగా, ఫ్లవర్ రూ. 6500-7000, గింజ సరుకు రూ. 2600-2800, లారీ బిల్జీ రూ. 3000, నారాయణపూర్, కిశకల్లో దాదాపు 1000-1500 బస్తాలు రాబడి కాగా రూ. 2400-2500 ధరతో వ్యాపారం జరిగింది. మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో 800-900 బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, గింజ సరుకు రూ. 3200-3800, ఓం బ్రాండ్ రూ. 9500, మీడియం ఫ్లవర్ రకం రూ. 6500-7500, తరానా, ఉన్హేల్లో 700-800 బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, గింజ సరుకు రూ. 3400-3700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, తమిళనాడుల కోసం రవాణా అవుతున్నది.


తమిళనాడులోని క్రిష్ణగిరిలో గత వారం 15 వేల బస్తాల కొత్త చింతపండు రాబడిపై గింజ సరకు రూ.2500-3000, మీడియం రూ. 2000-2200, పాపరంపట్టి లో దినసరి 10-15 వాహనాల కొత్త సరుకు రాబడిపై మైసూరు చపాతి రకం రూ. 7700-7800, మహారాష్ట్ర సరుకు రూ.8200, గింజ సరుకు రూ. 2800-2900, మైసూరు గింజ సరుకు రూ. 2000-2200, కర్ణాటక రకం రూ.1800-1900 మరియు సేలంలో గత వారం 10-12 వాహనాలు, కంభం, ధర్మపురి, దిండిగల్ ప్రాంతాలలో 15-20 వాహనాల అమ్మకం కాగా, మేలిమి రకం సరుకు రూ. 11,000-12,500, లోకల్ చపాతీ రకం రూ. 8000-8200, నడియాడ్ సరుకు రూ. 7500-8000, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 7500-8500, మీడియం రూ. 6000-6500, గింజ సరుకు రూ.2500-3000, బోట్ రకం రూ. 1700-1900 మరియు రాంచీలో 7- 8 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, గింజ సరుకు రూ. 2500–2600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


చింతగింజలు


తెలంగాణలోని మహబూబ్నగర్, నవాబ్పేట మరియు తదితర ప్రాంతాలలో దినసరి 2000 బస్తాల చింతగింజల రాబడి కాగా, రూ.1540-1560, సిద్దిపేటలో 5-6 వాహనాల రాబడి కాగా, రూ. 1550, పప్పు రూ. 2950, పౌడర్ ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని హిందుపూర్ మార్కెట్లో గతవారం 7-8 వాహనాలు, పుంగనూరులో 4-5 వాహనాల కొత్త చింతగింజల రాబడిపై ధర రూ.1500- 1550, పప్పు సూరత్ డెలివరి రూ. 3050, బార్షీ డెలివరి రూ. 2900-3000, సాలూరులో 2-3 వాహనాల చింతగింజలు రూ. 1350, పుంగనూరు డెలివరి రూ. 1550 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని తుంకూరులో 10-15 వాహనాలు, చెల్లకేరిలోని వారాంతపు సంతలో 10-12 వాహనాలు, బెల్గాంవ్లో రూ. 1450-1500 ధరతో వ్యాపారమైంది. బార్టీలో 1200-1500 బస్తాల రాబడిపై రూ.1500-1625, కర్ణాటక సరుకు రూ. 1650, పప్పు రూ. 2600-2700, పౌడరం రకం రూ.3200, నాణ్యమైన సరుకు రూ. 3500, తమిళనాడులోని పాపరంపట్టిలో 10-15 వాహనాల రాబడిపై గింజ సరుకు రూ.1350-1400 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం