గణనీయంగా పెరిగిన మొక్కజొన్న ఎగుమతులు - మొక్కజొన్న కొనుగోలుకు తెలంగాణ సర్కారు పచ్చజెండా

 

2022-23 కోసం మొక్కజొన్న కనీస మద్దతు ధర గత ఏడాదితో పోలిస్తే రూ. 1870 నుండి పెరిగి 1962 ప్రతి క్వింటాలుకు నిర్ధారించబడింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం మొక్కజొన్న ఉత్పత్తి లక్ష్యం గత సీజన్లోని ఇదే వ్యవధితో పోలిస్తే 226.50 ల.ట. నుండి పెంచి 231 ల.ట. నిర్ధారించింది. గడిచిన రెండేళ్లుగా అర్జెంటీనా, బ్రెజిల్ లాంటి ప్రముఖ దక్షిణ అమెరికా దేశాల నుండి సరఫరా తగ్గడంతో పాటు 2021-22 లో భారత్ నుండి ఎగుమతులు భారీగా పెరిగి విలువ దృష్ట్యా 102 కోట్ల డాలర్లకు చేరాయి.


మొక్కజొన్న కోసం బంగ్లాదేశ్, వియత్నాం, మలేషియా లాంటి దక్షిణ మరియు ఆగ్నేయాసియా దేశాల నుండి ఎగుమతి డిమాండ్ నెలకొన్నందున గత ఏడాది 63.10 కోట్ల డాలర్ల నుండి 61 శాతం పెరిగి 102.36 కోట్ల డాలర్ల విలువ గల 36.90 అ.ట.కు చేరాయి. 2019-20 లో విలువ దృష్ట్యా 14.20 కోట్ల డాలర్లతో 3.70 ల.ట. మొక్కజొన్న ఎగుమతి అయింది. ఈ ఏడాది ఏప్రిల్లో మొక్కజొన్న ఎగుమతులు మార్చితో పోలిస్తే 21 శాతం పెరిగి 2.51 ల.ట. నమోదయ్యాయి. బ్రెజిల్ మరియు అర్జెంటీనా నుండి సరఫరా పెరిగినందున బంగ్లాదేశ్ మరియు వియత్నాంకు ఎగుతులు క్షీణించాయి. మునుమందు కూడా తగ్గగలవని భావిస్తున్నారు. గత ఏడాది బంగ్లాదేశ్ మొక్కజొన్న దిగుమతులలో నేపాల్ను అధిగమించి ప్రముఖ కొనుగోలుదారుగా రాణించింది. 2019-20 లో బంగ్లాదేశ్ కొనుగోళ్లు 10 వేల టన్నులకు చేరలేదు..అయితే, అంతకు ముందు వరుసగా రెండు సంవత్సరాలు 15 వేల టన్నులను అధిగమించాయి. ఇదే విధంగా భారత్ నుండి వియత్నాం మొక్కజొన్న కొనుగోళ్లు 2020-21 లో 4.98 ల.ట., 2021-22 లో 11.80 ల.ట.కు చేరాయి. మలేషియా మొక్కజొన్న కొనుగోళ్లు 2020-21 లో 1.12 ల.ట., 2021-22 లో 2.66 ల.ట., నేపాల్ 5.87 ల.ట. కొనుగోలు చేసింది. గడిచిన పదేళ్లుగా మొక్కజొన్న ఉత్పత్తిలో భారతదేశం స్థిరత్వంతో కూడా వృద్ధి నమోదవుతున్నది. 2011-12 పంటకాలంలో 17.60 కోట్ల టన్నులు ఉండగా, 2021-22 నాటికి పెరిగి 3.30 కోట్ల టన్నులను అధిగమించింది. దక్షిణ అమెరికా దేశాలకు తగ్గిన సరఫరా, చౌకగా మారిన ధరలతో వియత్నాం, మలేషియా లాంటి దేశాల కొనుగోళ్ల వలన భారత మొక్కజొన్న ఎగుమతులకు చేయూత లభించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ మరియు వియత్నాం నుండి డిమాండ్ కొరవడినందున ఈ ఏడాది మొక్కజొన్న ఎగుమతులు 5 ల.ట. మేర తగ్గగలవని భావిస్తున్నారు.




మొక్కజొన్న కొనుగోలుకు తెలంగాణ సర్కారు పచ్చజెండా


హైదరాబాద్ : రైతు స్వరాజ్య వేదిక (ఆర్ఎస్ఎస్ఐ) అసోసియేషన్ చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం తెలంగాణ సర్కారుకు తాఖీదు జారీచేసిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో కనీస మద్దతు ధర (ఎంఎస్పి) ప్రతి క్వింటాలు రూ. 2738 తో కొనుగోలు చేసేందుకు సమ్మతించింది.


రైతుల నుండి జొన్నలు కొనుగోలు చేసేందుకు తెలంగాణ సర్కారును ఆదేశించాలని ఆర్ఎస్పి సామాజిక కార్యకర్త సంగోపు బోర్నా ఉన్నత న్యాస్థానాన్ని ఆశ్రయించారు. ఎందుకనగా, పారబాయిల్డ్ బియ్యం కొనుగోలు చేసేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తమ రైతులకు వరి స్థానంలో జొన్న సాగు చేపట్టినందున ఉత్పత్తి పెరగడానికి దోహదమైంది. ఇటీవల ముగిసిన రబీ సీజన్లో జొన్న సేద్యం ముందు సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 75 వేల ఎకరాల నుండి 1.25 లక్షల ఎకరాలకు విస్తరించింది. అయితే, రైతులు తమ పంటను రూ. 1500-1700 ప్రతి క్వింటాలు ధరతో విక్రయించి భారీ నష్టాలను మూట గట్టుకుంటున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇక ముందు ఎప్పుడైనా ధరలు డీలా పడినట్లయితే, ప్రభుత్వమే కొనుగోలు చేపట్టాలని వీరు కోరుతున్నారు. రబీ సీజన్లో శనగలు, మొక్కజొన్న మరియు జొన్న సేద్యం చేపడుతుంటారు. జొన్నల కోసం ప్రతి క్వింటాలు కనీస మద్దతు ధర రూ. 2738 ప్రభుత్వం నిర్ధారించగా సజ్జల ధర రూ. 1500-1700 నిర్ధారించబడింది. సజ్జల సేద్యంలో ప్రతి ఎకరానికి రూ. 2140 ఖర్చు మరియు 12 క్వింటాళ్లు వచ్చిందని రైతులు వాపోతున్నారు. రైతుల నుండి జొన్నల కొనుగోలు కోసం సంగోపు బోర్న్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి జారీచేసిన తాఖీదులో రెండు వారాలలో తమ సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా, వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ కమిషనర్ మరియు సంచాలకులు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ మరియు తెలంగాణ మార్కెఫెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు కూడా తాఖీదు జారీ చేసిన తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు దిగివచ్చింది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు