పత్తి

 


 అమెరికాలో పత్తి ఉత్పత్తి తగ్గినట్లు సంకేతాలు అందిన తర్వాత అంతర్జాతీయ విపణిలో ధరలు దూసుకుపోవడం ప్రారంభమైంది. అటు తర్వాత దేశీయ మార్కెట్లో వ్యాపారులు అప్రమత్తత పెరిగినందున గుజరాత్లో పతి ప్రతి కండీ ధర ఎ గ్రేడ్ పత్తి రూ. 99,000–1,00,000, బి గ్రేడ్ రూ. 96,000-97,000, గింజలు ప్రతి క్వింటాలు రూ. 3250- 3700 మరియు మహారాష్ట్రలో రూ. 10,000–11,000, పత్తి గింజలు రూ. 3400-4200 ప్రతి క్వింటాలు మరియు 30 మి.మీ. పొడుగుపింజ ప్రతి కండీ పత్తి రూ.1,30,000-1,40,000, అకోలాలో 29 మి.మీ. పత్తి రూ. 99,000-1,01,500, ఖాన్దేశ్, మరాట్వాడలో రూ. 97,000–1,02,000 ప్రతి కండీ ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని వరంగల్లో 30 మి.మీ. పొడుగుపింజ పత్తి రూ. 1,00,000 1,02,000, భైంసాలో 29 మి.మీ. పత్తి రూ. 1,00,000-1,02,000 ప్రతి కండీ మరియు ప్రతి క్వింటాలు రూ. 11,000-12,100, పత్తి గింజలు రూ. 3700-4000, ఆదోనిలో పత్తి రూ. 94,000-1,01,000 మరియు క్వింటాలు రూ. 7000-12,100 పత్తి గింజలు రూ.2600-4000 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog