బలవడుతున్న ఆముదాల వాయిదా ధరలు

 


 గత సోమవారం ఎస్సిడిఇఎక్స్ వద్ద సెప్టెటంబర్ వాయిదా రూ. 7400 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 150 వృద్ధి చెంది రూ. 7550 వద్ద ముగిసింది.

రైతులకు  గత ఏడాది మంచి ధర లభించడంతో పాటు గుజరాత్, రాజస్థాన్ లాంటి ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో భారీ వర్షాల వలన ఇతర పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో రైతులు ఆముదం సాగుకు ముందుకు రావడంతో ప్రస్తుత ఖరీఫ్ లో ఆగష్టు 19 వరకు దేశంలో ఆముదాల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4,65,000 హెక్టార్ల నుండి తగ్గి 6,00,100 హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్లో విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 3,27,806 హెక్టార్ల నుండి పెరిగి 1,17,054 హె.లకు చేరింది. రాజస్థాన్లో విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 31,000 హెక్టార్ల నుండి పెరిగి 1,34,000 హెక్టార్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్లోని ఆదోని వారంతపు సంతలో 700-800 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 6800-7050, నిమ్ము సరుకు రూ. 6200-6500, గిద్దలూరు, వినుకొండలో 3-4 వాహనాల కొత్త సరుకు రాబడిపై రూ.6800-7000, కర్నూలు, ఎమ్మిగనూరు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 600-700 బస్తాల కొత్త సరుకు రూ. 6800-6970 ప్రతి క్వింటాలు మరియు నరసరావుపేటలో బిఎస్ఎస్ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1650 టాక్స్-పెయిడ్, కమర్షియల్ రూ. 1610, పిండి ప్రతి క్వింటాలు రూ.2300, హైదరాబాద్లో ఆముదం గింజలు రూ. 7500 మరియు నూనె 10 కిలోలు బిఎస్ఎస్ రూ. 1630, కమర్షియల్ రూ. 1580, పిండి ప్రతి క్వింటాలు రూ. 2100 ధరతో వ్యాపారమై మంగళగిరి, తెనాలి ప్రాంతాల కోసం రవాణా అవుతున్నది.

Comments

Popular posts from this blog