యాలకులు

 

పెద్ద యాలకుల వేలాలు


సిలిగుడి - ఆగస్టు 18న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ. 518.75 నుండి పెరిగి రూ. 525, చిన్న గింజ సరుకు ధర రూ. 450 ప్రతి కిలోకు చేరగా, గ్యాంగ్టక్లో పెద్ద యాలకుల ధర రూ. 525, చిన్నవి రూ. 475 ప్రతి కిలో మరియు పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో పెద్ద గింజ ధర రూ. 650 నుండి పెరిగి రూ. 662.50, చిన్నగింజ రూ. 521.25 నుండి తగ్గి రూ. 517.50 ప్రతి కిలోకి చేరింది.


చిన్న యాలకులు 


బోడినాయకనూర్ యాలకులు వేలం కేంద్రాలలో ఆగస్టు 16 న జరిగిన వేలాలలో 47,228 కిలోల సరుకు రాబడి కాగా, 43,603 కిలోల సరుకు సగటున రూ. 995.56 ప్రతి కిలో ధరతో అమ్మకం అయింది. అయితే నాణ్యమైన రకాల కోసం గరిష్టంగా రూ. 1438 ప్రతి కిలో ధర లభించింది. మధ్యాహ్నపు వేలాలలో 86,871 కిలోల సరుకు రాబడిపై 82,170 కిలోల సరుకు సగటున రూ. 1058.19 మరియు నాణ్యమైన సరుకు గరిష్టంగా రూ. 1504 ప్రతి కిలో ధరతో అమ్మకం అయింది. ఆగస్టు 17 న జరిగిన వేలాలలో 34,488 కిలోల సరుకు రాబడి కాగా, 25,183 కిలోల సరుకు సగటున రూ. 935.87 ప్రతి కిలో ధరతో అమ్మకం అయింది. అయితే నాణ్యమైన రకాల కోసం గరిష్టంగా రూ. 1414 ప్రతి కిలో ధర లభించింది. మధ్యాహ్నపు వేలాలలో 74,331 కిలోల సరుకు రాబడిపై 71,184 P కిలోల సరుకు సగటున రూ.1026.55 మరియు నాణ్యమైన సరుకు గరిష్టంగా రూ. 1523 ప్రతి కిలో ధరతో అమ్మకం అయింది.



దేశంలో 2021-22 (ఆగస్టు-జూలై) సీజన్ యాలకుల ఉత్పత్తి ముందు సీజన్లో పోలిస్తే 3.6 శాతం క్షీణించి 23,340 టన్నులకు చేరగా ఎగుమతులు 63 శాతం వృద్ధి చెంది 10,572 టన్నుల ఎగబాకాయని మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఆగస్టులో ప్రారంభమైన యాలకుల సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమైందని వ్యాపారులు తెలిపారు. గత వారం (ఆగస్టు 16-20) 6,63,442 కిలోల యాలకులు రాబడి కాగా 5,97,690 కిలోల సరుకు అమ్మకమైంది. మంగళవారం యావరేజ్ సరుకు ప్రతి కిలో రూ.916.58 పలికిన ధర రూ. 1058.19, గురువారం నాణ్యమైన సరుకు రూ.1336 పలుకగా శనివారం నాటికి రూ. 150 కి ఎగబాకింది.

Comments

Popular posts from this blog