బఠాణీలు

 



హైదరాబాద్ ఉయిన్- రష్యా యుద్ధంతో ఉక్రెయిన్లో బఠాణీల సాధారణ ఉత్పత్తి 5.55 ల.ట. నుండి తగ్గి 1.50 ల.ట.కు పరిమితం కాగలదని తెలుస్తోంది. మరోవైపు ప్రపంచంలో అతిపెద్ద బఠాణీల ఉత్పాదక దేశమైన రష్యాపై ఆర్థిక ఆంక్షలు కొనసాగుతున్నందున దిగుమతి దేశాల కొనుగోళ్లు కుంటుపడ్డాయి. రష్యా ప్రతియేటా 30 అట, బఠాణీలు ఉత్పత్తి చేస్తున్నందున ప్రస్తుతం విధించిన ఆర్థిక ఆంక్షలతో అంతర్జాతీయ విపణిలో బఠాణీల ధరలు దూసుకుపోతున్నాయి. 


చైనా తమ పశుగ్రాసం కోసం యేటా 15-20 ల.ట. సరుకు దిగుమతి చేసుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ధరలు దూసుకుపోగలవని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా దేశంలోని ఉత్పాదక కేంద్రాల వద్ద ప్రతి రోజు 2 వేల బస్తాల బఠాణీల రాబడిపై పాలిష్ సరుకు ధర రూ. 200 పెరిగి రూ.5200-5600, అన్-పాలిష్ రూ. 4800-5000, ఆకుపచ్చ బఠాణీలు రూ. 4000-4500, ఉరైలో 400-500 బస్తాలు తెల్ల బఠాణీలు రూ.1600-5150 మరియు 100 బస్తాల ఆకుపచ్చ బఠాణీలు రూ. 4000-4100, కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 5150-5350, మధ్య ప్రదేశ్ సరుకు రూ.5100-5300 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog