శనగల ధర కోసం భారీ ఆశలు వద్దు

 


 లభించిన సమాచారం ప్రకారం శనగల నిల్వలు మరియు నా ఫెడ్ అమ్మకాలను పరిగణలోకి తీసుకుంటే ధరలు ఎక్కువగా పెరిగే అవ కాశం లేదు. అంతే కాకుండా ఈ సారి అనుకూల వర్షాల వలన విస్తీర్ణం పెరగవచ్చు. ప్రభుత్వం సబ్సిడీ ధరతో సరుకు విక్రయించాలని ప్రతిపాదించిన తరు వాత మార్కెట్లో సర ఫరా పెరిగే అవకాశం ఉన్నందున మార్కెట్లో గత వారం దిల్లీలోని లారెన్స్ రోడు వద్ద 100-120 వాహనాల శనగల రాబడి పై రాజస్తాన్ శనగలు రూ. 4800, మధ్యప్రదేశ్ సరుకు రూ. 4850 మరియు ముంబైలో టాంజానియా శనగలు రూ. 4150-4250, సూడాన్ కాబూలి శనగలు రూ.5800-5900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో జెజె శనగలు రూ. 4900, ఒంగోలులో కాక్-2 కాబూలి కొత్త శనగలు రూ. 6900, పాత సరుకు రూ. 7300, డాలర్ శనగలు రూ. 10,000, కర్ణాటక ప్రాంతపు హుబ్లీ, ధార్వాడ్, గదగ్ ప్రాంతాల శనగలు ఈరోడ్ డెలివరి రూ. 5250-5325, గుంతకల్ ప్రాంతం శనగలు రూ. 5250-5300, ముంబెల్లో దిగుమతి అయున టాంజానియా సరుకు మదురై డెలివరి రూ. 4700 ధరతో వ్యాపారమెంది.

 మహారాష్ట్రలోని సోలాపూర్ లో మిల్లు రకం రూ. 4500-4550, అమరావతిలో రూ. 4400-4525, లాతూర్ లో రూ. 4500-4700, అకోలాలో రూ. 4600-4625, లాతూర్ ప్రాంతం పప్పు బెంగుళూరు డెలివరి రూ. 5700, అకోలా ప్రాంతపు సార్టెక్స్ రూ. 5600, నాన్-సార్టెక్స్ రూ. 5400, 

మధ్య ప్రదేశ్ లోని పిపరియా, అశోక్ నగర్, బసోదా, నిమచ్, హర్గా ప్రాంతాలలో రూ. 4000-4500, ఇండోర్ లో రూ. 4700-4750, డాలర్ శనగలు రూ. 9000-10,000, కాబూలి శనగలు 40-42 కౌంట్ రూ. 11,100, 42-44 కౌంట్ రూ. 10,900, 44-46 కౌంట్ రూ. 10,700, 58-60 కౌంట్ రూ. 9700, 60-62 కౌంట్ రూ. 9600, 62-64 కౌంట్ రూ. 9500 ధరతో వ్యాపారమైంది. 

ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ లో 300-400 బస్తాల రాబ డిపె రూ. 4000-4350, ఉరైలో రూ. 4300-4400, రాజస్తాన్ లోని కేడి, బికనీర్,జోధ్ పూర్, కిషన్ గఢ్, సుమేర్ పూర్, కోటా ప్రాంతాలలో 3-4 వేల బస్తాల రాబడి పై రూ. 4300-4350, జె పూర్ లో రూ. 4750-4825 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం