దేశంలో సమృద్ధిగా నిల్వలు ఉండడంతో పాటు అనుకూల వర్షాల వలన కొత్త సీజన్ లో విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నందున స్టాకిస్టుల అమ్మ కాలు పెరిగాయి. దీనితో గత వారం ధరలు తగ్గాయి. కొత్త సీజన్ లో స్టాకిస్టులు ముందుకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందున ధర తగ్గి రూ. 4000-4200 స్థాయిలో ఉండే అవకాశం కలదు. ఎందుకనగా గత మూడు సంవత్సరాలుగా స్టాకిస్టులకు లాభం చేకూరడం లేదు.
గత వారం దిల్లీలోని లారెన్స్ రోడ్ వద్ద 80-85 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ శనగలు రూ. 4825, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 4750 మరియు ముంబైలో టాంజానియా శనగలు రూ. 4250-4350, సూడాన్ కాబూలి శనగలు రూ. 5800-5900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో జెజె శనగలు రూ. 4900, ఒంగోలులో రూ. 4900, కాక్-2 కాబూలి కొత్త శనగలు రూ. 7100, పాత సరుకు రూ. 7300,డాలర్ శనగలు రూ. 10,000,
కర్ణాటక ప్రాంతపు హుబ్లీ, ధార్వాడ్, గదగ్ ప్రాంతాల శనగలు ఈరోడ్ డెలివరి రూ. 100 తగ్గి రూ. 5200-5250 మరియు ముంబైలో దిగుమతి అయున టాంజానియా సరుకు మదురై డెలివరి రూ. 4600 ధరతో వ్యాపారమెంది.
మహారాష్ట్రలోని సోలాపూర్ లో మిల్లు రకం రూ. 4400-4550, అన్నగిరి రూ. 4900-4950, అమరావతిలో రూ. 4200-4350, లాతూర్ లో రూ. 4500-4700, అకోలాలో రూ. 4600, లాతూర్ ప్రాంతం పప్పు బెంగుళూరు డెలివరి రూ. 5600, అకోలా ప్రాంతపు సార్టెక్స్ రూ. 5500, నాన్-సార్టెక్స్ రూ. 5300,
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు