పెరిగిన ఆముదాల ధరలు

  


ఈ ఏడాది ఆముదాల సేద్యం గణనీయంగా విస్తరించినప్పటికీ ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. ఎందుక న గా, ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలైన గుజరాత్, రాజస్తాన్ లో రైతులు సరుకు పూర్తిగా హరించుకుపోవడమే ఇందుకు నిదర్శనం. అక్టోబర్ లో ఎగుమతి డిమాండ్ నెలకొనే అంచనాతో ఎన్ సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం అక్టోబర్ వాయిదా రూ. 7414 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 74 ఎగబాకి రూ. 7488, నవంబర్ వాయిదా రూ. 144 వృద్ధి చెంది రూ. 7490 వద్ద ముగిసింది.


ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 23 నాటికి దేశంలో ఆముదాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7.40 ల.హె. నుండి పెరిగి 8.81 ల.హె.కు విస్తరించింది. ఇందులో గుజరాత్ సేద్యం 5,99,563 హెక్టార్ల నుండి పెరిగి 6,84,398 హెక్టార్లకు విస్తరించింది.

ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, గిద్దలూరు, వినుకొండ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో ఆముదాల రాబడులు పోటెత్తినందున ధరలు ఒత్తిడికి గురై ప్రతి క్వింటాలు రూ. 200-300 పత న మైంది. ఆదోని మార్కెట్లో గత వారం 10-12 వేల బస్తాల కొత్త ఆముదాల రాబడిపై రూ. 62006350, గిద్దలూరు, వినుకొండలో 8-10 వాహనాలు రూ. 6000-6200, కర్నూలు, ఎమ్మిగనూరు మరియు పరిసరప్రాంతాల మార్కెట్లలో కలిసి 6-7 వేల బస్తాల కొత్త సరుకు రూ. 5970-6510 ప్రతి క్వింటాలు మరియు నరసరావుపేటలో బిఎస్ఎస్ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1540 టాక్స్-పెయిడ్, కమర్షియల్ రూ. 1500, పిండి ప్రతి క్వింటాలు రూ. 2250, 

హైదరాబాద్లో ఆముదం గింజలు రూ. 7200 మరియు నూనె 10 కిలోలు బిఎస్ఎస్ రూ. 1520, కమర్షియల్ రూ. 1480, తెలంగాణలోని దేవరకద్ర, జడ్చర్లప్రాంతాలలో 100-125 బస్తాల సరుకు రాబడిపై రూ. 6100-6250, నాణ్యమైన సరుకు రూ. 6600-6690 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.సిద్దాపూర్, పాలన పూర్, జునాగఢ్, దిసా, పాటన్ , విశానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 7-8 వేల బస్తాల ఆముదాల రాబడిపై నాణ్య మైన సరుకు రూ. 7100-7250,మీడియం రూ. 6600-6800, రాజస్తాన్ లోని జోధ్ పూర్ లో రూ. 6600-6700 ప్రతి క్వింటాలు మరియు ఆముదం నూనె 10 కిలోలు రూ. 1460 ధరతో వ్యాపారమైంది.

 తమిళనాడులోని సేలం మార్కెట్లో 75 కిలోల బస్తా రూ. 5200, నూనె 15 కిలోల డబ్బా రూ. 2900, పిండి 70 కిలోలు రూ. 1400, దిండిగల్ లో నూనె 15 కిలోల డబ్బా రూ. 2750 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog