డీలాపడుతున్న పసుపు వాయిదా మార్కెట్

   


గత వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నందున మార్కెట్ లకు రాబడులు తగ్గినప్పటికీ పరోక్ష విపణిలో ధర ప్రతి క్వింటాలుకు రూ. 400-500, ప్రత్యక్ష విపణిలో రూ. 100-150 పతనమైంది. ఎన్ సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం సెప్టెంబర్ వాయిదా రూ. 7098 తో ప్రారంభమై సాయంకాలం వరకు ఎలాంటి ఒడిదొడుకులకు గురికాకుండా అదే ధరతో ముగియగా అక్టోబర్ వాయిదా రూ. 7316 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 460 క్షీణించి రూ. 6856, నవంబర్ వాయిదా మంగళవారం రూ. 7379 తో ప్రారంభమై శు3కవారం నాటికి రూ. 368 కోల్పో యి రూ. 7010 వద్ద ముగిసింది. 


తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం మహారాష్ట్ర నుండి 4-5 వేల బస్తాల సరుకు రాబడి కాగా ధర రూ. 100-150 క్షీణించి కొమ్ములు రూ. 6500-7100, దుంపలు రూ. 5700-6200 లోకల్ లూజ్ మరియు కొమ్ములు పాలిష్ సరుకు లారీ బిల్టి రూ. 7900-8000, దుంపలు రూ. 6900-7000, బంగ్లాదేశ్ కోసం కొమ్ములు రూ. 7000, 

వరంగల్ లో 300-400 బస్తాలు కొమ్ములు రూ. 5500-5700, దుంపలు రూ. 5000-5200, కేసముద్రం మార్కెట్లో 300-400 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 4500–5500, దుంపలు రూ. 4500-5000 మరియు 

ఆంధ్రప్రదేశ్ లోని దుగ్గిరాలలో 400-500 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు మరియు దుంపలు రూ. 5400-5700, పుచ్చు సరుకు రూ. 4500–5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మహారాష్ట్రలోని హింగోళి మార్కెట్లో బుధవారం 18-20 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 5700-6700, దుంపలు రూ. 5400-5900, 

సాంగ్లీలో 3-4 వేల బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి పసుపు రూ. 7100-7200, దేశీ కడప రూ. 6200-6500 మరియు 

నాందేడ్ లో 6-7 వేల బస్తాలు రూ. 6000-6800, దుంపలు రూ. 6000-6500, 

బస్మత్ నగర్ లో 2 వేల బస్తాలు కొమ్ములు రూ. 6000-6100, దుంపలు రూ. 5500-5800 ప్రతి క్వింటాలు నాణ్యతానుసారం వ్యాపారమైంది. 

తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 10-12 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 5699-7789, దుంపలు రూ. 5419-7086, పెరుందురైలో 4-5 వేల బసాలు కొమ్ములు రూ. 5699-8259, దుంపలు రూ. 5099-6769 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog