శనగ సాగు ప్రారంభం

 


 లభించిన సమాచారం ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మరియు దక్షిణాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో ఖరీఫ్ పంట కోతలతో పాటు శనగ సాగు కూడా ప్రారంభమైంది. అయితే అనేక ప్రాంతాలలో పంట సాగు కోసం మరో నెల సమయం ఉంది. దేశంలో భారీగా సరుకు నిల్వలు ఉన్నందున కొందరు రైతులు శనగల స్థానంలో ధరలు ఆకర్షణీయంగా ఉన్న కుసుమల సాగుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరియు సమృద్ధిగా సరుకు నిల్వలు ఉండడంతో పాటు శనగ పప్పుకు డమాండ్ ఉన్నందున వారం రోజులుగా ధరలు రూ. 50-100 హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి.


గత వారం దిల్లీలోని లారెన్స్ రోడు వద్ద 90-95 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ శనగలు రూ. 75–100 వృద్ధిచెంది రూ. 4900, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 4850 మరియు ముంబైలో టాంజానియా శనగలు రూ. 4300-4425, సూడాన్ కాబూలి కొత్త సరుకు రూ. 5850-5950 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో జెజె శనగలు రూ. 4900,ఒంగోలులో రూ. 4900, కాక్-2 కాబూలి కొత్త శనగలు రూ. 7000, పాత సరుకు రూ. 7200, డాలర్ శనగలు రూ. 10,000 మరియు 

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో మిల్లు రకం రూ. 4400-4600, అన్నగిరి రూ. 4900-4950, అమరావతిలో రూ. 4250-4550, లాతూర్‌లో రూ. 4500-4700, అకోలాలో రూ. 4675, లాతూర్ ప్రాంతం పప్పు బెంగుళూరు డెలివరి రూ. 5700-5800, అకోలా ప్రాంతపు సార్టెక్స్ రూ. 5600, గులాబీ సార్టెక్స్ రూ. 5800,

 మధ్య ప్రదేశ్ లోని పిపరియా, అశోక్ నగర్, బసోదా, నిమచ్, హర్గా ప్రాంతాలలో రూ. 4000-4550, కాబూలి శనగలు రూ. 8000-9900 మరియు ఇండోర్‌లో రూ. 4825-4850, డాలర్ శనగలు రూ. 9000-10,500, కాబూలి శనగలు 40-42 కౌంట్ రూ.11,600, 42-44 కౌంట్ రూ. 11,400, 44–46 కౌంట్ రూ. 11,100, 58-60 కౌంట్ రూ. 10,100, 60-62 కౌంట్ రూ. 10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఉత్తరప్రదేశ్ లోని మహోబాలో రూ. 4200-4500, లలిత పూర్లో రూ. 4000-4300, ఉరైలో రూ. 4300-4600, రాజస్తాన్లోని కేడి, కిషన్ గఢ్, సుమేర్ పూర్ ప్రాంతాలలో రూ. 4250-4400, జెఫూర్ లో రూ. 4825-4875, పప్పు రూ. 5475-5500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.



 సిరిశనగ - దేశంలో రాబోవు రబీ సీజన్ కోసం అక్టోబర్ చివరి వారం నుండి సిరి శనగ సాగు ప్రారంభం కాగలదు. ప్రభుత్వం కూడా అపరాల ఉత్పత్తి పెరగడం కోసం రబీ సీజన్ శనగలు, సిరిశనగ, కుసుమలు, ఆవాలు లాంటి ఉత్పత్తుల మద్దతు ధర లను పెంచే అవకాశం కలదు. విదేశాలలో ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో దిగుమతులు పెరిగే అవకాశం ఉన్నందున కొనుగోలుదారులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందన గత వారం ఉత్తర ప్రదేశ్ లోని ఉరెలో రూ. 5400-5800, ఝాన్సీలో రూ. 5000-5350, బరేళిలో సన్న రకం రూ. 7500, లావు రకం రూ. 6650, మధ్య ప్రదేశ్ లోని కరేళిలో 400-500 బస్తాలు రూ. 5400-6350, దేవాలో రూ. 5200-5500, జబల్ పూర్ లో రూ. 5000-5600, అశోక్ నగర్ లో రూ. 5500-6000, బసోదాలో రూ. 5800-6100, ఇండోర్‌లో రూ. 6000-6100, ఛత్తీ లోని భాజాపారాలో రూ. 5400-5500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. ముంబైలో కెనడా సరుకు కంటెనర్లో రూ. 6100, ఆస్ట్రేలియా సరుకు రూ. 6200, ముంద్రా ఓడరేవు వద్ద రూ. 5850, కోల్ కత్తాలో కెనడా సరుకు రూ. 5975-6000, ఆస్ట్రేలియా రూ. 6075–6100, దిల్లీలో కెనడా సరుకు రూ. 6150, మద్య ప్రదేశ్ సరుకు రూ. 6600 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog