బలహీన పడుతున్న కొత్త మొక్కజొన్న ధరలు

  


దేశంలో ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న పంట కోతలు శరవేగంతో చే పడుతున్నారు. అయితే, కొన్ని రాష్ట్రాలలో ఇటీవల కురిసిన వర్షాలకు కోతల ప్రక్రియ కుంటుపడుతున్నది. అయితే , మొత్తంమీద 2022-23 సీజన్ లో కోళ్ల పరిశ్రమ కొనుగోళ్లు భారీగా ఇనుమడించే అవకాశం ఉంది.


తెలంగాణలోని నిజామాబాద్, మెట్ పల్లి ప్రాంతాలలో గత వారం 12-15 వాహనాల మొక్కజొన్న రాబడిపై రూ. 1800-2200, ఆంధ్రప్రదేశ్ లోని చాగలమర్రి, ఆత్మకూరు ప్రాంతాలలో 5-6 వాహనాల సరుకు రాబడి పై స్థానికంగా రూ. 1850-1900, విజయనగరంలో 10-15 వాహనాలు రూ. 2200-2250, అనకాపల్లి పౌల్టీ పరిశ్రవు డెలివరి రూ. 2350,సాలూరులో 7-8 వాహనాలు, చీపురుపల్లిలో 15-20 వాహనాల సరుకు రాబడి పై విజయన గరం బయో-టెక్ డెలివరి రూ. 2450, గుంటూరు, తెనాలిలో నిల్వ అయిన సరుకు దేవరపల్లి కోసం లారీ బిల్టి రూ. 2400, హనుమాన్ జంక్షన్ కోసం రూ. 2400-2450, హిందూపూర్, నంద్యాల, మడకశిర ప్రాంతాల నుండి బెంగుళూరు డెలివరి రూ. 2300-2350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

కర్ణాటకలోని చిత్రదుర్గ్, చెల్లకేరి, దావణగెరె, బళ్లారి, రాణి బెన్నూర్ప్రాంతాలలో ప్రతి రోజు 12-15 వేల బస్తాల మొక్కజొన్న రాబడి పై రూ. 2100-2200, తమిళ నాడులోని దిండిగల్ లో ప్రతి రోజు 40 వాహనాల మొక్కజొన్న రాబడి పై స్థానిక మార్కెగట్ లలో రూ. 2000-2100, ఒట్టవ న్ చ త్రం, అరియలూరు,పెరంబూరు ప్రాంతాలలో 25 వాహనాలు రూ. 2000-2150, నమక్కల్ రూ. 2200, ఉడుముల్ పేట, ఈరోడ్, పల్లడం డెలివరి రూ. 2200-2250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నందున కొత్త మొక్కజొన్న రాబడులకు అంతరాయం ఏర్పడుతున్నది. అయితే, అక్టోబర్ చివరి నాటికి రాబడులు భారీగా పోటెత్తగలవని తెలుస్తోంది. మధ్య ప్రదేశ్ లోని నీముచ్ లో పచ్చ మొక్కజొన్న రూ. 2200-2250,మీడియం రూ. 2100-2150, గజ్జర్ రకం రూ. 2200, తెలుపు రూ. 2300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog