కొచ్చి - రాబోవు పండుగల డిమాండ్ తో ఇతర రాష్ట్రాల వ్యాపా రుల కొనుగోళ్ల తో పాటు పంట కోతలు కూడా ముమ్మరమయ్యే అవకాశం ఉంది. అయితే పాత సరుకు నిల్వలు కూడా ఉన్నాయి.
గత సోమవారం నుండి శనివారం వరకు కేంద్రాల వద్ద 8,80,630 కిలోల యాలకుల రికార్డు రాబడి కాగా, వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అంచనాతో వేలం కేంద్రాల వద్ద సోమవారం ధర సగటున రూ. 1072.52 ప్రతి కిలో తో పోలిస్తే శుక్రవారం నాటికి రూ. 109 క్షీణించి రూ. 963.68 ధరతో వ్యాపారమెంది.అయి తే నాణ్యమైన సరుతే ధర సోమవారం రూ. 1805 ఉండగా, గురు వారం నాటికి రూ. 439 తగ్గి రూ. 1366 ధరతో అమ్మకమైంది. దీనితో దీపావళి లోపు మందకొడికి అవకాశం కలదు.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు