తెలంగాణలో వృద్ధి చెందిన వరి,క్షీణించిన పప్పు ధాన్యాల సేద్యం

 

Telangana cultivation

హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ 1 నాటికి మొత్తం పంటల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,19,16,633 ఎకరాల నుండి పెరిగి 1,28,20,698 ఎకరాలకు విస్తరించింది. ఇందులో వరి సేద్యం 46,63,640 ఎకరాలకు గాను 58,28,686 ఎకరాలకు విస్తరించింది.


ముతక ధాన్యాల శ్రేణిలో జొన్న సేద్యం 57,504 ఎకరాల నుండి తగ్గి 33,732 ఎకరాలు, మొక్కజొన్న 6,08,862 ఎకరాల నుండి తగ్గి 6,05,954 ఎకరాలకు పరిమితం కాగా సజ్జ సేద్యం 313 ఎకరాల నుండి పెరిగి 997 ఎకరాలు, రాగులు 592 ఎకరాల నుండి 612 ఎకరాలకు విస్తరించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 1 నాటికి రాష్ట్రంలో పప్పు ధాన్యాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 10,74,733 ఎకరాల నుండి తగ్గి 6,50,082 ఎకరాలకు పరిమితమైంది. ఇందులో కందులు 8,96,585 ఎకరాల నుండి తగ్గి 5,55,020 ఎకరాలు, పెసలు 1,34,828 ఎకరాల నుండి 65,207 ఎకరాలు, మినుములు 41,928 ఎకరాల నుండి తగ్గి 29,195 ఎకరాలు, ఉలువలు 247 ఎకరాలకు పరిమితమైంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 1 నాటికి రాష్ట్రంలో నూనెగింజల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3,74,535 ఎకరాల నుండి పెరిగి 4,47,636 ఎకరాలకు విస్తరించింది. ఇందులో సోయాచిక్కుడు సేద్యం 3,48,829 ఎకరాల నుండి పెరిగి 4,29,029 ఎకరాలు, సఫ్లవర్ 37 ఎకరాల నుండి 192 ఎకరాలకు విస్తరించగా వేరుసెనగ 16,015 ఎకరాల నుండి తగ్గి 13,072 ఎకరాలు, నువ్వులు 121 ఎకరాల నుండి 406 ఎకరాలు, ఆముదాలు 9233 ఎకరాల నుండి 4177 ఎకరాలకు పరిమితమైంది.

ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 1 నాటికి రాష్ట్రంలో నూనెగింజల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే చెరకు సేద్యం 32,222 ఎకరాల నుండి పెరిగి 35,121 ఎకరాలకు విస్తరించగా పత్తి సేద్యం 50,87,151 ఎకరాల నుండి తగ్గి 48,95,905 ఎకరాలకు పరిమితం కాగా పొగాకు 48 ఎకరాల నుండి పెరిగి 97 ఎకరాలకు పరిమితమైంది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం