పెరిగిన కొత్త మొక్కజొన్న



 వ్యవసాయ మంత్రిత్వశాఖ వారు జారీ చేసిన నివేదిక ప్రకారం 30, సెప్టెంబర్ వరకు దేశంలో ముతక ధాన్యాల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 175.15 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 183.89 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో మొక్కజొన్న విస్తీర్ణం 82.17 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 84.23 లక్షల హెక్టార్లకు చేరగా, సజ్జ విస్తీర్ణం 63.61 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 69.95 లక్షల హెక్టార్లకు, రాగుల విస్తీర్ణం 9.66 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 9.40 లక్షల హెక్టార్లకు,జొన్న విస్తీర్ణం 14.67 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 14.23 లక్షల హెక్టార్లకు చేరింది. 


లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది వర్షాల పరి స్థితి మరియు రికార్డు ధరల కారణంగా రబీ సీజన్ లో విస్తీర్ణం పెరిగే అవకాశం కలదు. అయితే, ఖరీప్ సీజన్ సరుకు రాబ డులు ప్రారంభం కావడంతో ధరలు మందకొడిగా ఉన్నాయి. ఎందుకనగా, సరుకు నిమ్ముతో వస్తున్నది మరియు స్టాకి స్టులు ధరలు తగ్గిన తరువాత కొనుగోళ్లను ప్రారంభించే అవకాశం కలదు.

నిజామాబాద్, మెట్ పల్లి ప్రాంతాలలో గతవారం 15-20 లారీల కొత్త సరుకు రాబడి పె రూ. 2000-2100లోకల్ లూజు మరియు కర్నూలు జిల్లాలోని చాగలమర్రి, ఆత్మ కూరు ప్రాంతాలలో 7-8 లారీలు, నంద్యాలలో దిన సరి 25-30 లారీలు మరియు హిందూపూర్, మడకశిర ప్రాంతాలలో 20-30 లారీల రాబడిపె స్థానికంగా రూ. 1850-2000, బెంగుళూరు డెలివరీ రూ. 2150-2175, చెన్నై కోసం రూ. 2200 ధరతో వ్యాపారమయింది.

విజయనగరం ప్రాంతంలో 20-25 లారీలు, సాలూ రులో 7-8 లారీలు, చీపురుపల్లి లో 25-30 లారీల కొత్త సరుకు రాబడిపె రూ. 2100-2150, దేవరపల్లి డెలివరీ రూ. 2280 మరియు గుంటూరు, తెనాలి ప్రాంతాలలో నిల్వ అయి న సరుకు వారంలో 20-25 లారీల అమ్మకంపై దేవరపల్లి కోసం లారీ బిల్టీ రూ. 2180 ధరతో వ్యాపారమయింది.

కర్నాటకలోని చిత్రదుర్గ, చెల్లకేరి, దావణగేరి, బళ్లారి, కుష్టగీ, రాణిబిదనూరు ప్రాంతాలలో దినసరి 15-20 వేల బస్తాల రాబడి పె రూ. 1800-2150 మరియు ఝార్ఖండ్ లోని రాంచీ, లోహార్ దాగా, హజారీబాగ్ ప్రాంతాలలో యాసంగి సీజన్ సరుకు స్థానిక మార్కెట్లలో రూ. 2000-2100 ధరతో వ్యాపారమయింది. .

తమిళనాడులోని దిండిగల్ లో దినసరి 20 లారీలు, వొడ న ఛత్రం, అరియలూరు, పెరుంబలూరు ప్రాంతాలలో 12-15 లారీల కొత్త సరుకు రాబడి పై స్థానికంగా రూ. 2100-2150 ధరతో వ్యాపారమయింది. మధ్య ప్రదేశ్ లోని నిమచ్ లో గతవారం 1 వేయి బస్తాల మొక్కజొన్న రాబడిపై పచ్చరకం రూ. 2200, మీడియం రూ. 2100, గజ్జర్ క్వాలిటీ రూ. 2150, తెలుపు రకం రూ. 2250 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog