పసుపు నిల్వలు భేష్

 



 దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పాదక రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులో సరుకు నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. మసాలా గైండింగ్ యూనిట్ల వద్ద డిసెంబర్ చివరి దాకా సరిపడునంత సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నందున ధరలు - పురోగమించే అవకాశం లేదు.ఎన్ సిడి ఇఎక్స్ వద్ద అక్టోబర్ వాయిదా రూ. 7154 తో ప్రారంభమై గురువారం నాటికి రూ. 12 వృద్ధి చెంది రూ. 7156, నవంబర్ వాయిదా రూ. 256 పెరిగి రూ. 7690 వద్ద ముగిసింది. 


ఉత్పాదక రాష్ట్రాలలో కొనుగోళు కుంటుపడినందున ధరలు సంభించాయి. నవంబర్ నుండి సాకిస్తుల నిల్వ సరుకు అమ్మకాలు జోరందుకోగలవని తెలుస్తోంది. సీజన్ ప్రారంభం లగాయతు ఇప్పటి వరకు పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తోంది. దేశంలోని తూర్పు రాష్ట్రాలలో సేద్యం గడిచిన కొన్నేళ్లతో పోలిస్తే ఈసారి విస్తృతంగా చేపట్టబడింది.


 నిజామాబాద్ లో గతవారం 4-5 వేల బస్తాల అమ్మకంపై కొమ్ము రూ. 6400-7100, గట్టా రూ. 5400-6200 లోకల్ లూజ్ మరియు లారీ బిల్టీ పాలిష్ కొమ్ము రూ. 7500-7600, పాలిష్ గట్టా రూ. 7000-7100 మరియు బంగ్లాదేశ్ కోసం కొమ్ము రూ. 7000 మరియు వరంగల్, కేసముద్రం ప్రాంతాలలో కొమ్ము రూ. 5500-5800, గట్టా రూ. 5000-5200, పుచ్చు రకం రూ. 4200-4500 ధరతో వ్యాపారమయింది. 


ఆంధ్రప్రదేశ్ లోని దుగ్గిరాలలో కొమ్ములు, దుంపలు రూ. 5300-5700 ధరతో వ్యాపారమెంది.

మహారాష్ట్రలోని హింగోలిలో సోమ, బుధ వారాలలో కలిసి 9-10 వేల బస్తాల రాబడిపె కొమ్ము రూ. 6200-7200, గట్టా రూ. 5400-6400 మరియు సాంబ్లీలో 4-5 వేల బస్తాల అమ్మకంపై రాజాపురి రూ. 8500-9000, మీడియం రూ. 7000-7700, దేశీ కడప రూ. 6000-6500, నాందేడ్ లో 3-4 వేల బస్తాల అమ్మకం కాగా, కొమ్ములు రూ. 6200-7000, దుంపలు రూ. 5500-6500,


 బస్మత్ నగర్ లో 3 వేల బసాల అమ్మకంపై కొమ్ము రూ. 5500-6800, గటా రూ. 5300-5600 ధరతో వ్యాపారమయింది.


 తమిళనాడులోని ఈరోడ్ లో గతవారం 6-7 వేల బస్తాల రాబడిపె కొమ్ము రూ. 5599-7299, గట్టా రూ. 5402–6899 మరియు పెరుందరైల్లో 3 వేల బస్తాల రాబడిపై కొమ్ము రూ. 5689-7955, గట్టా రూ. 5029-6759 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog