ఆముదాల రాబడి

 



ఆదోనిలో వారంలో 10-15 వేల బస్తాల కొత్త ఆముదాల రాబడిపె రూ. 5950-6080, గిద్దలూరు, వినుకొండ ప్రాంతాలలో 4 లారీల రాబడిపై రూ. 5900-6000 మరియు కర్నూలు, ఎమ్మిగనూరు తదితర మార్కెట్లలో కలిసి వారంలో 15-20 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై 


రూ.5800-6050 మరియు నరసారావుపేటలో బిఎస్ఎస్ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1500 టాక్స్ పెయిడ్, కమర్షియల్ రూ. 1480 ధరతో వ్యాపారమయింది. దేవరకద్ర, జడ్చర్ల ప్రాంతాలలో200 బస్తాల రాబడిపే రూ. 5850-5960 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది. 

గుజరాత్ లోని రాజ్ కోట్, గోండల్, సిద్దాపూర్, పాలన్పూర్, జూనామడ్, దీసా, పాటన్, విశానగర్ తదితర మార్కెట్లలో కలిసి దినసరి 8 వేల బస్తాల రాబడిపె నాణ్యమైన సరుకు రూ. 6800-7000, మీడియం రూ. 6400-6560 మరియు రాజస్తాన్లోని జోధ్ పూర్ లో రూ. 6100-6400 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog