రబీ మొక్కజొన్నకు పెరుగుతున్న ఆదరణ




 ప్రస్తుత సీజన్ లో అక్టోబర్ 21 నాటికి దేశంలో ముతక ధాన్యాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.45 ల.హె. నుండి పెరిగి 2.45 ల.హె.కు విస్తరించింది. ఇందులో మొక్కజొన్న 43 వేల హెక్టార్ల నుండి 65 వేల హెక్టార్లు, జొన్న 95 వేల హెక్టార్ల నుండి 1.65 ల.హె., రాగులు 5 వేల హెక్టార్ల నుండి 10 వేల హెక్టార్లు మరియు బార్లీ 1000 హెక్టార్ల నుండి పెరిగి 5 వేల హెక్టార్లకు విస్తరించింది. 


దేశంలో సంతృప్తికరమైన వర్షాలు, సానుకూల వాతావరణంతో రబీ సీజన్ సేద్యం శరవేగంతో చేపడుతున్నారు. సేద్యం భారీగా విస్తరించే అవకాశం కనిపిస్తున్నందున పౌల్టీ పరిశ్రమ, స్టార్చ్ కర్మాగారాలు మరియు బేసన్ తయారీదారులు ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న నిల్వ చేసేందుకు ఆసక్తి కనబరచడంలేదు. ఎందుకనగా వాతావరణం సానుకూలంగా పరిణమిస్తున్నందున ఖరీఫ్ మొక్కజొన్న రాబడులు పోటెత్తున్నాయి. జనవరి వరకు కొత్త సరుకు రాబడులు అందుబాటులో ఉండగలవు. ప్రపంచ వ్యాప్తంగా మొక్కజొన్న ఉత్పత్తి తగ్గినందున ఎగుమతి డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. 


మధ్య ప్రదేశ్ పసుపుపచ్చ మొక్కజొన్న పంజాబ్, హర్యాణా డెలివరి రూ. 2420 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది. నిజామాబాద్, మెట్ పల్లి ప్రాంతాలలో గతవారం 30-35 లారీల కొత్త సరుకు రాబడి పె రూ. 1577-2326 మరియు కర్నూలు జిల్లాలోని చాగలమర్రి, ఆత్మకూరు ప్రాంతాలలో 20-25 లారీలు, నంద్యాల లో దినసరి 40 వాహనాల రాబడిపై స్థానికంగా రూ. 1900-2000, లోడింగ్ కండీషన్ సరుకు రూ. 2150-2200 మరియు హిందూపూర్, మడకశిర ప్రాంతాలలో 20-25 లారీల రాబడిపై స్థానికంగా రూ. 2100-2200, బెంగుళూరు డెలివరీ రూ. 2350-2400 ధరతో వ్యాపారమయింది. 

విజయనగరం ప్రాంతంలో 10-15 లారీలు, సాలూరులో 15 లారీలు, చీపురుపల్లిలో 15-20 లారీల కొత్త సరుకు రాబడిపె రూ. 2100-2200, విశాఖపట్టణం ఓడరేవు డెలివరి రూ. 2260-2300, పెద్దాపురం కోసం రూ. 2275-2300 మరియు గుంటూరు, తెనాలిప్రాంతాలలో నిల్వ అయిన సరుకు ప్రతి రోజు 5-6 లారీల అమ్మకంపై రూ. 2450-2480 ధరతో వ్యాపారమయింది. 

కర్నాటకలోని చిత్రదుర్గ, చెల్లకేరి, దావణగేరి, బళ్లారి, కుష్టగీ,రాణిబి దనూరు ప్రాంతాలలో దినసరి 20 వేల బస్తాల రాబడిపె రూ. 1900-2200 మరియు ఝార్ఖండ్ లోని రాంచీ, లోహాదాగా, జారీబాగ్ ప్రాంతాలలో యాసంగి సీజన్ సరుకు స్థానిక మార్కెట్లలో రూ. 2250-2300 ధరతో వ్యాపారమయింది. 

తమిళనాడులోని దిండిగల్ లో దినసరి 10 లారీలు, వొడనఛత్రం, అరియలూరు, పెరుంబలూరు ప్రాంతాలలో 10 లారీల కొత్త సరుకు రాబడిపె స్థాని కంగా రూ. 2300-2350, నామకల్, ఈరోడ్ డెలివరి రూ. 2480-2500 ధరతో వ్యాపారమెంది. 

మధ్యప్రదేశ్ లోని నీమచ్ లో గత వారం 2 వేల బస్తాలు, కరేళిలో 10-15 వేల బస్తాల మొక్కజొన్న రాబడి కాగా, పచ్చ మొక్కజొన్న రూ. 2100-2150, మీడియం రూ. 2000-2100, గజ్జర్, తెలుపు రకం సరుకు రకం రూ. 2100-2150 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog