వృద్ధి చెందుతున్న పత్తి పంట - అడుగంటుతున్న నిల్వలు

 



ప్రపంచంలో అతిపెద్ద పత్తి ఉత్పాదక దేశమైన భారత్ లో అక్టోబర్ 1 నుండి ప్రారంభమైన ప్రస్తుత పత్తి సీజన్ (2022-23) కోసం దేశంలో పత్తి ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 12 శాతం ఇనుమడించి 3.44 కోట్ల బేళ్ల (ప్రతి బేలు 170 కిలోలు) కు చేరగలదని ప్రముఖ పత్తి వ్యాపార సమాఖ్య పేర్కొన్నది. కొత్త సీజన్ మిగులు నిల్వలు గత సీజన్ తో పోలిస్తే 71.80 లక్షల బేళ్ల నుండి తగ్గి 31.90 లక్షల బేళ్లతో ప్రారంభమైంది. 


తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ధరలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకనగా పత్తి సేద్యం 10 శాతం వృద్ధి చెందింది. దేశంలో పత్తి వార్షిక వినియోగం 3.18 కోట్ల బేళ్ల నుండి పెరిగి 3.20 కోట్ల బేళ్లకు చేరే అంచనా వ్యక్తమవుతున్నది. ఎగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే 43 లక్షల బేళ్ల నుండి తగ్గి 35 లక్షల బేళ్లకు పరిమితం కాగలవని భావిస్తున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రస్తుతం పంట కోతల తరుణంలో అకాల వర్షాలు కురిసినందున మొక్కలపై ఎండిన పత్తి కాయలు ప్రభావితమయ్యాయి. ఎందుకనగా కోతకు సిద్ధమైన పత్తి కాయలు ఆరబెట్టిన తర్వాత విచ్చుకుంటాయి. విచ్చుకున్న కాయలపై వర్షం కురిసినందున రంగు కూడా వెలిసిపోయే అవకాశం ఉంది. అయితే, కాయలు విచ్చుకున్న పొలాలలో పంటకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట నేల వాలింది. ప్రస్తుత వాతావరణం మరియు వర్షాలను దృష్టిలో పెట్టుకొని పంట నాణ్యత మరియు దిగుబడులు ఇనుమడించగలవని భావిస్తున్నారు. ఎందుకనగా దిగ్గజ రైతులు గత సీజన్లో లాభసాటి ధరలు చవి చూడడమే ఇందుకు ప్రధాన కారణం. వీరు తమ సరుకు విక్రయించేందుకు తొందరపాటు ప్రదర్శించరు. వస్త్ర మిల్లులలో సరుకు నిల్వలు అందుబాటులో లేనందున రాబడి అయిన సరుకు తక్షణమే విక్రయించబడ గలదు. తాత్కాలికంగా మూత పడిన మిల్లులు పునఃప్రారంభమవుతున్నాయి. వీరికి నిరంతరం సరుకుకు డిమాండ్ ఉండగలదు.



ఆదిలాబాద్లో తగ్గిన పత్తి రాబడులు

ఆదిలాబాద్ : ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు దాదారు 4 లక్షల ఎకరాలకు విస్తరించింది. అయితే, భీంపూర్ మండలంలో అకాల వర్షాలు కురిసినందున పత్తి మరియు కంది పంటకు తీరని నష్టం వాటిల్లింది. ఇందుకోసం వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ లో అక్టోబర్ 14 నాటికి కొత్త పత్తి వ్యాపారం ప్రారంభమైన తర్వాత రాబడులు కుంటుపడ్డాయి. అకాల వర్షాలు కురిసినందున ఉత్పత్తి తగ్గే అంచనా మరియు పత్తి సేద్యం తర్వాత మొదటి నెలలో భారీ వర్షాలు కురిశాయి. అంతేకాకుండా కీటక దాడితో పాటు ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పత్తి పూలు వాడిపోవడమే కాకుండా మొక్కలకు నష్టం వాటిల్లినందున పింక్ బోల్ వార్మ్ సోకి మొత్తం పంట ప్రభావిత మైంది. పంట దిగుబడులు తుడిచిపెట్టుకుపాయాయి. తద్వారా పలు గ్రామాలలో పత్తి కోతల ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అక్టోబర్ 14-17 మధ్య కాలంలో 22 మంది రైతులు కేవలం 350 క్వింటాళ్ల పత్తి మార్కెట్ కు తరలించారు. 8 శాతం నిమ్ము సరుకు ప్రతి క్వింటాలు ధర రూ. 8300 వ్యాపారులు ప్రతిపాదించారు. మరో 1-2 వారాలలో రాబడులు పోటెత్తగలవు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సరుకులో నిమ్ము శాతం మోతాదు మించినందున రైతులు తమ సరుకును మార్కెట్లకు తరలించడం లేదని ఆదిలాబాద్ మార్కెట్ యార్డు అధికారులు పేర్కొన్నారు. దీపావళి పండుగ తర్వాత కోతల ప్రక్రియ జోరందుకోగలదు.

Comments

Popular posts from this blog