పెరిగిన శనగల మద్దతు ధర

 



గత వారం ఖరీఫ్ సీజన్ లోని ఆరు పంటల మద్దతు ధరలను పెంచుతున్న కేంద్ర మంత్రివర్గ సమావేశానంతం ప్రకటించింది. ఇందులో శనగల కోసం ప్రస్తుతం ఉన్న రూ. 5230 నుండి రూ. 105 పెంచి రూ. 5335 ప్రతి క్వింటాలుకు నిర్ధారించింది. శనగ సేద్యం పురోగతిపై గత వారమే రాజస్తాన్ నుండి నివేదిక అందింది. రాబోయే సీజన్ లో బఫర్ నిల్వలకోసం కేంద్ర ప్రభుత్వం కందులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తున్నదని వ్యాపార వర్గాలు తమ అభిప్రాయం వెల్లడించాయి.


దేశంలో అక్టోబర్ 21 నాటికి రబీ సీజన్ పప్పు ధాన్యాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2.65 ల.హె. నుండి పెరిగి 4.63 ల.హె.కు విస్తరించింది. ఇందులో శనగ సేద్యం గత ఏడాదితో పోలిస్తే 2.13 ల.హె. నుండి 86 శాతం పెరిగి 3.97 ల.హె.కు విస్తరించింది. గత వారం పప్పు ధాన్యాల మద్దతు ధరలు పెరిగినందున బేసన్ తయారీదారుల డిమాండ్ నెలకొని దేశీ శనగల ధర ప్రతి క్వింటాలుకు రూ. 75-100, కాబూలీ శనగలు రూ.400-500 ఎగబాకాయి. ఈ ఏడాది ఆగస్టులో ఆస్ట్రేలియా నుండి శనగల ఎగువుతులు జూలైతో పోలిస్తే 38,677  టన్నుల నుండి 4 శాతం తగ్గి 37,003 టన్నులకు పరిమితమయ్యాయని సాంస్వియక్ కార్యాలయం విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఇందులో పాకిస్తాన్ 29,172 టన్నులతో అతిపెద్ద కొనుగోలు దేశంగా ప్రసిద్ధికెక్కింది. అటు తర్వాత నేపాల్ 2605 టన్నులు మరియు కెనడా నుండి 1651 టన్నుల సరుకు దిగుమతి చేసుకున్నది.ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా శనగల మొత్తం ఎగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7,57,726 టన్నుల నుండి 36 శాతం తగ్గి 4,82,307 టన్నులకు పరిమితమయ్యాయి.


దిల్లీ లారెన్స్ రోడ్లో గత వారం 70-75 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ శనగలు రూ.25 వృద్ధి చెంది రూ. 4900, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 4850 మరియు ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 4350-4500 ధరతో వ్యాపారమై ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక పప్పు మిల్లుల కోసం రవాణా అవుతున్నది. సూడాన్ కాబూలి శనగలు రూ. 6050-6150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లో కాక్ -2 కాబూలీ శనగలు కొత్త సరుకు రూ. 7350, పాత సరుకు రూ. 7600, డాలర్ శనగలు రూ. 10,400, కర్నూలు మరియు ఒంగోలులో జెజె శనగలు రూ. 4875-4900, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్ మరియు కర్ణాటకలోని హుబ్లీ, ధార్వాడ్, గదగ్ ప్రాంతాల సరుకు ఈరోడ్ డెలివరి రూ. 5150, ట్యుటికోరిన్ ఓడరేవు వద్ద దిగుమతి అయిన సరుకు రూ. 4700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు, కర్ణాటకలోని బెంగుళూరు, మైసూరు ప్రాంతాల పప్పు మిల్లుల కోసం రవాణా అవుతున్నది.


మహారాష్ట్రలోని సోలాపూర్ మిల్లు రకం శనగలు రూ. 4300–4600, అన్నిగిరి శనగలు రూ. 4900-4950, అమరావతిలో 2-3 వేల బస్తాల సాదా శనగలు రూ.4200-4450, లాతూర్లో రూ. 4600-4700, అకోలాలో రూ. 4700, లాతూర్ ప్రాంతం పప్పు రూ. 5750, అకోలా రూ. 5700, నాన్-సార్టెక్స్ రూ.5600 ధరతో వ్యాపారమైంది.


 మధ్య ప్రదేశ్లోని అశోక్నగర్, బసోదా, బినా, దేవాస్, గాడర్వాడ్, మందసోర్, సాగర్ మరియు రాష్ట్రంలోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద నాణ్యమైన శనగలు రూ. 4600-4700, మీడియం రూ. 4000-4100, ఇండోర్లో దేశీ శనగలు రూ.4900-4925, కాబూలీ శనగలు రూ. 10,000-12,000, కాబూలీ శనగలు 40-42 కౌంట్ రూ. 12,700, 42-44 కౌంట్ రూ. 12,500, 44-46 కౌంట్ రూ.12,300, ఉత్తరప్రదేశ్లోని మహోబ, లలిత్పూర్, రార్, ఉరైలో రూ. 4450 - 4650, రాజస్తాన్లోని కేక్, కిషన్ ఢ్, సుమేరుప్పూర్, కోటా, రామ్ంజ్మీండి ప్రాంతాలలో రూ.4000-4500, జైపూర్లో రూ. 4875-4925, పప్పు రూ. 5550-5575 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్, గోండల్, దాహోద్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు దాదాపు 10-12 వేల బస్తాల శనగల రాబడిపై రూ. 4000-4400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog