పెరిగిన పసుపు వాయిదా ధరలు

 



 గత వారం ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రా లాంటి పసుపు ఉత్పా దక రాష్ట్రాలలో వర్షాల కారణంగా రాబడులు తగ్గడంతో పాటు ఎగుమతి డిమాండ్ ఉండడంతో మార్కెట్, వాయిదా ధరలు రూ. 150-200 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. లభించిన సమాచారం ప్రకారం గత రెండు నెలలుగా ధరలు స్థిరంగా ఉండడంతో పసుపు వాయిదా వ్యాపారం చేసేవారి గిరాకీ పెరుగుతున్నది. దీనితో ధర లలో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. అయితే మార్కెట్లో సరుకు నిల్వలు ఉన్నాయి. అమ్మకందారులు ధరలు పెరగడాన్ని నిరీక్షిస్తున్నారు. అయితే ఎన్ సిడిఇఎ లో సోమవారం అక్టోబర్ వాయిదా రూ. 6812 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 142 పెరిగి రూ. 6954 మరియు నవంబర్ వాయిదా రూ. 314 పెరిగి రూ. 7424 ధరతో ముగిసింది.


 ఖమ్మం కోల్డు స్టోరేజీలలో సుమారు 5.42 లక్షల బస్తాల నిల్వలు ఉన్నట్లు అంచనా. నిజామాబాద్లో గతవారం 5-6 వేల బస్తాల అమ్మకంపై కొమ్ము రూ. 6500-7100, గట్టా రూ. 5500-6200 లోకల్ లూజ్ మరియు లారీ బిల్టీ పాలిష్ కొమ్ము రూ. 7500-7600, పాలిష్ గట్టా రూ. 7000-7100 మరియు బంగ్లాదేశ్ కోసం కొమ్ము రూ. 7000 మరియు వరంగల్, కేసముద్రం ప్రాంతాలలో కొమ్ము రూ. 5500-5900, గట్టా రూ. 5000-5300, పుచ్చు రకం రూ. 4200-4500 ధరతో వ్యాపారమయింది. 


ఆంధ్ర ప్రదేశ్ లోని దుగ్గిరాలలో కొమ్ములు, దుంపలు రూ. 5500-5800 ధరతో వ్యాపారమెంది. 


మహారాష్ట్రలోని హింగోలిలో సోమ, బుధ మరియు శుక్రవారాలలో 10 12 వేల బస్తాల రాబడిపై  కొమ్ము రూ.6000-7000, గట్టా రూ. 5400-6300 మరియు సాంగ్లీలో 3-4 వేల బస్తాల అమ్మకంపై రాజాపురి రూ. 7000-9000, దేశీ కడప రూ. 6000-6500, నాందేడ్ లో 4-5 వేల బస్తాల అమ్మకం కాగా, కొమ్ములు రూ. 6200-7100, దుంపలు రూ. 5500-6500,బస్మత్ నగర్ లో 2-3 వేల బస్తాల అమ్మకంపై కొమ్ము రూ. 5700-7000, గట్టా రూ. 5500-5800 ధరతో వ్యాపారమయింది. 


తమిళనాడులోని ఈరోడ్ లో గతవారం 8-10 వేల బస్తాల రాబడి పె కొమ్ము రూ. 5639-7512, గట్టా రూ. 5299-6599 మరియు పెరుందరెలో 2 వేల బస్తాల రాబడిపె కొమ్ము రూ. 5532-7891, గట్టా రూ. 4829-6829 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog