బలోపేతం చెందుదుతన్న మొక్కజొన్న ధరలు

 



 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలో తరుచుగా కురుస్తున్న వర్షాలకు ఉత్పాదకులు తమ పంటను ఆరబెట్టడానికి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అడుగంటిన పాత సరుకు నిల్వలు పొట్టీ పరిశ్రమ డిమాండ్ నెలకొన్నందున దరలకు మద్దతు లభిస్తున్నది. దేశంలో ఖరీఫ్ సీజన్ పంట కోతలతో పాటు రబీ సీజన్ సేద్యం ప్రక్రియ ప్రారంభమైందని వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ వారంతపు నివేదికలో పేర్కొన్నది. అక్టోబర్ 14 వరకు మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 32 వేల హెక్టార్ల నుండి పెరిగి 36 వేల హెక్టార్లు, రాగులు 1000 హెక్టార్లు, జొన్న సేద్యం 42 వేల హెక్టార్ల నుండి తగ్గి 39 వేల హెక్టార్లకు పరిమితమైంది.


తెలంగాణలోని నిజామాబాద్, మెట్ పల్లి ప్రాంతాలలో గత వారం 30 వాహనాల మొక్కజొన్న రాబడిపై రూ. 1800-2150, ఆంధ్ర ప్రదేశ్ లోని చాగలమర్రి, ఆత్మకూరు ప్రాంతాలలో 15-20 వాహనాలు, నంద్యాలలో ప్రతి రోజు 35-40 వాహనాల సరుకు రాబడిపై స్థానికంగా రూ. 1800-1900, లోడింగ్ కండిషన్ రూ. 2050–2100, హిందూపూర్, మడకశిర ప్రాంతాలలో 15-20 వాహనాలు స్థానికంగా రూ. 1900-2000, బెంగుళూరు డెలివరి రూ. 2150, చెన్నై కోసం రూ. 2200, విజయనగరంలో 20-25 వాహనాలు, సాలూరులో 12-15 వాహనాలు, చీపురుపల్లిలో 18-20 వాహనాల సరుకు రాబడిపై రూ. 2100–2150, విశాఖపట్నం ఓడరేవు డెలివరి రూ. 2260, పెద్దాపురం కోసం రూ. 2250, గుంటూరు, తెనాలిలో నిల్వ అయిన సరుకు ప్రతి రోజు 4-5 వాహనాల సరుకు అమ్మకంపై రూ. 2350-2400, లోడింగ్ కండిషన్ ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని చిత్రదుర్గ్, చెల్లకేరి, దావణగెరె, బళ్లారి, రాణి బెన్నూర్ ప్రాంతాలలో ప్రతి రోజు 20 వేల బస్తాల మొక్కజొన్న రాబడి పై రూ. 1900-2100, ఝార్ఖండ్ లోని రాంచీ, లోహ గా, హజారీబాగ్ ప్రాంతాలలో యాసంగి మొక్కజొన్న స్థానిక మార్కెట్లలో రూ. 1900-2100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని దిండిగల్ లో ప్రతి రోజు 7-8 వాహనాలు, ఓడన ఛత్రం, అరియలూరు, పెరుందురై ప్రాంతాలలో 10 వాహనాల కొత్త మొక్కజొన్న రాబడిపై స్థానిక మార్కెట్లలో రూ. 2200-2250, నమక్కల్, ఈరోడ్ డెలివరి రూ. రూ. 2400, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్ లోని నీమలో గత వారం 2 వేల బస్తాలు, కరేలిలో 8-10 వేల బస్తాలు సరుకు రాబడిపై పచ్చ మొక్కజొన్న రూ. 2350-2375, మీడియం రూ. 2100-2200, గజ్జర్ రకం రూ. 2150, తెలుపు రూ. 2200-2250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog