చింతపండుకు కొరవడిన గిరాకీ

 


 దేశంలోని ప్రముఖ చింతపండు ఉత్పాదక రాష్ట్రాలలో ఇప్పటికీ,, సరకు రాబడి అవుతోంది. కాగా, సరుకు నాణ్యత లోపించినందున ధరలు క్షీణిస్తున్నాయి. ఝార్ఖండ్ లోని రాంచీ, లోహర్దాగా మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో 20-25 వాహనాల గింజ సరుకు రాబడిపై రంగు వెలసిన సరుకు రూ. 1900–2000, బిల్జీ సరుకు రూ. 2200-2500 ధరతో వ్యాపారమైంది.


 ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో గత వారం 100-120, పుంగనూరులో 25-30 వాహనాల కొత్త చింతపండు రాబడిపై సిల్వర్ రకం సరుకు రూ. 18,000-20,000, మేలిమి రకం (50-60 శాతం రంగు సరుకు) రూ. 15,000–18,000, మీడియం 12,800–14,000, ఫ్లవర్ నాణ్యమైన సరుకు 7500–8500, మీడియం 5500-6500, యావరేజ్ సరుకు డిస్కెలర్ ఫ్లవర్ రూ. 4500-5500 మరియు పుంగనూరులో గింజ సరుకు 3200-3500, చపాతి రూ.9000-10,500, కళ్యాణదుర్గ్, రాయదుర్గిలో 1-2 వాహనాలు మేలిమి రకం 13,000–15,000, మీడియం 10,000-12,000, ఫ్లవర్ 6000-7500 ధరతో వ్యాపారమైంది. సాలూరు, పార్వతీపురం ప్రాంతాలలో 20-25 వాహనాలు గింజ సరుకు రూ. 2600–3000, సెమీ-ఫ్లవర్ యావరేజ్ 5000-5100, నాణ్యమైన సరుకు 8500-9000, మహబూబ్నగర్లో గత వారం 8-10 వాహనాలు, నవాబ్ పేటలో 2-3 వాహ నాలు, షాద్నర్లో 2-3 వాహనాల రాబడిపై ఫ్లవర్ రూ. 5000–8200 మరియు హైదరాబాద్లో 13-15 వాహనాల సరుకు రాబడి కాగా ఉద్గిర్, లాతూర్ ప్రాంతాల మేలిమి రకం రూ. 12,000–15,000, ఫ్లవర్ 5000-7000, హిందూపూర్ సరుకు 6500-8000, తెలంగాణలోని సంగారెడ్డి, జహీరాబాద్ సరుకు 6000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 కర్ణాటకలోని బెల్గాంవ్లో 8 వాహనాలు, చెల్లకేరేలో 40-50 వాహనాలు, తుంకూరులో 25 వాహనాల సరుకు రాబడిపై మేలిమి రకం రూ. 18,000-20,000, నాణ్యమైన సరుకు రూ.15,000-16,000, మీడియం 11,000–13,000, ఫ్లవర్ 5000-5500 ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ 8-10 వాహనాల సరుకు అమ్మకంపై ఓం బ్రాండ్ రూ. 9500, ఫ్లవర్ మీడియం 7000-8000, గింజ సరుకు 3500, ఉన్హేల్, తరానాలో 8-9 వేల బస్తాల కొత్త చింతపడు రాబడిపై గింజ సరుకు 2700–3000, ఎండు సరుకు 3100–3200, మీడియం రూ.2800-2900, యావరేజ్ రూ. 2600–2700 మరియు గుజరాత్లోని గోద్రా, నడియాడ్లో 3-4 వాహనాలు గింజ సరుకు 2400-2500, జగదల్పూర్ సహా, ఛత్తీస్గఢ్లోని అన్ని ప్రాంతాలలో కలిసి ప్రతిరోజు 10 వాహనాల రాబడిపై గింజ సరుకు రూ. 2400-2500 లారీ బిల్జీ ధరతో వ్యాపారమైంది.

 తమిళనాడులోని కృష్ణగిరిలో 7-8 వాహనాల కొత్త సరుకు రాబడి పై చపాతీ గింజ సరుకు రూ. 3800- 4000, మీడియం 3000–3300, మహారాష్ట్ర సరుకు 2300-2500, పాపరంపట్టిలో 25-30, సేలంలో 20, దిండిగల్లో ప్రతిరోజు 5-6 వాహనాలు, కంబం, ధర్మపురిలో 4-5 వాహనాల చొప్పున సరుకు రాబడి కాగా ఫ్లవర్ మేలిమి రకం 13,000-15,000, చపాతీ స్థానికంగా 8500-8600, మహారాష్ట్ర సరుకు 9000-9300, ఫ్లవర్ 7500-8000, నాణ్యమైన గింజ సరుకు స్థానికంగా రూ.2800-3200, మహారాష్ట్ర సరుకు 3300-3500, నలగ్గొట్టని చింతపండు రూ.2300-2500, లోకల్లో రూ. 2000–2200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని బార్షీలో ప్రతి రోజు 1000–1500 బస్తాల కొత్త చింతపండు రాబడిపై ఫ్లవర్ రంగు సరుకు (60-70 శాతం రంగు సరుకు) రూ. 7500-8000, మీడియం రూ. 7000-7200, యావరేజ్ సరుకు 7000-7100, అహ్మద్ నగర్ లో 1000-1200 బస్తాలు నాణ్యమైన 70 శాతం రంగు సరుకు) రూ.8000-8700, మీడియం 7000-7500, యావరేజ్ సరుకు 6000-6500 ధరతో వ్యాపారమైంది. 


చింత గింజలు : 

ఆంధ్ర ప్రదేశ్లోని హిందూపూర్లో 10 వాహనాల కొత్త చింతగింజల రాబడి కాగా ప్రతి క్వింటాలు రూ. 1700-1750, పప్పు సూరత్ డెలివరి రూ. 3000-3050, బారీ డెలివరి రూ. 2900, చింతగింజల పొడి 4400-4500, పుంగనూరులో 4-5 వాహనాల రాబడిపై చింతగింజలు 1700, సాలూరులో 6 వాహనాల చింతగింజలు స్థానికంగా 1500-1525, పుంగనూరు డెలివరి 1750-1800, బార్షీలో 600-700 బస్తాల చింత గింజలు 1720, నవాబ్ పేట, జడ్చర్ల, షాద్ నగర్ లో 4-5 వాహనాలు చింతగింజలు స్థానికంగా 1620-1640, మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో వారంలో 7-8 వాహనాల రాబడి కాగా, రూ. 1700, కర్ణాటకలోని తుంకూరులో 15-20 వాహనాలు, చెల్లకేరిలో 5-60 వాహనాలు, బెల్గాంలో 3 వాహనాలు రూ. 1600-1650, తమిళనాడులోని పాపరంపట్టి, క్రిష్ణగిరిలో 10-15 వాహనాలు 1600 ధరతో వ్యాపారమైంది.


Comments

Popular posts from this blog