ఆదరణ కోల్పోతున్న శనగ కొనుగోళ్లు

  


ఈ ఏడాది దేశంలో శనగ ఉత్పత్తి గత ఏడాదితో పోల్చితే 135.40 ల.ట. నుండి స్వల్పంగా పెరిగి 136.30 ల.ట.కు చేరగలదని మార్కెట్ నిపుణుల అంచనా. కనీస మద్దతు ధర రూ. 5335 కు గాను స్వేచ్ఛా విపణిలో తక్కువగా ఉంది. తద్వారా పతనమవుతున్న శనగ ధరలను దృష్టిలో పెట్టుకొని నాఫెడ్చే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఏప్రిల్ 20 వరకు మొత్తం కొనుగోళ్లు 11.68 ల.ట.కు చేరాయి. ఇందులో మహారాష్ట్ర నుండి 4.93 ల.ట., మధ్యప్రదేశ్ లో 2.67 ల.ట., గుజరాత్లో 2.23 ల.ట., కర్ణాటకలో 68,268 టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 53,623 టన్నులు మరియు తెలంగాణలో 50,238 టన్నులు కొనుగోలు చేయగా రాజస్తాన్లో నత్తనడక సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం 10,839 టన్నులు సరుకు కొనుగోలు చేయబడింది.


ఉత్పాదక కేంద్రాల వద్ద పెరుగుతున్న రాబడులు, దిగజారుతున్న కొనుగోళ్లతో గత వారం శనగల ధర ప్రతి క్వింటాలుకు రూ. 50-75 పతనమైంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఒంగోలు, గుంతకల్, జమ్మలమడుగు, తాడిపత్రి, ఇంకొల్లు ప్రాంతాలలో జెజె శనగలు రూ. 4900-5000, కాక్-2 కాబూలీ శనగలు కొత్త సరుకు రూ. 7700, డాలర్ శనగలు అన్-క్లీన్ సరుకు రూ. 10,000-10,100, జెజె శనగలు మధురై డెలివరి రూ. 5325-5350, కర్ణాటకలోని హుబ్లీ, ధార్వాడ్, గదగ్ ప్రాంతాల సరుకు ఈరోడ్ డెలివరి రూ. 5400, మహారాష్ట్ర సరుకు రూ. 5200-5225, లాతూర్ ప్రాంతం పప్పు సార్టెక్స్ బెంగళూరు డెలివరి రూ. 5900, అకోలా ప్రాంతపు సరుకు రూ. 5750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్లో రూ. 4900-5000, సోలాపూర్లో అన్నిగిరి శనగలు రూ. 4800-5100, మిల్లు రకం సరుకు రూ. 4700-4800, అమరావతి, అకోలా, వాషిం, ధరియాపూర్, బార్షీ, జాల్నా ప్రాంతాలలో రూ. 4500-4650 లోకల్ లూజ్, అకోలా, నాగ్పూర్ నుండి లారీ బిల్టి రూ. రూ. 5100-5150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గత వారం దిల్లీ లారెన్స్ రోడ్లో 60-70 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 5050-5075, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 5025, ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన  శనగలు రూ. 4800, సూడాన్ కాబూలీ శనగలు రూ. 7350, ఇండోర్లో శనగలు రూ. 5050-5100 మరియు డాలర్ శనగలు రూ. 9000-10,000, కాబూలీ శనగలు 40-42 కౌంట్ రూ. 12,300, 42-44 కౌంట్ రూ. 12,100, 44-46 కౌంట్ రూ. 11,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని కల్బుర్గిలో రూ. 4600-4750, చిత్రదుర్గ్, యాద్గిర్, బీదర్, సేడెం ప్రాంతాలలో రూ. 4600-4900 మరియు మధ్య ప్రదేశ్ లోని విదిశ, గాడర్వాడ్, అశోక్ నగర్, జబల్పూర్, బసోదా ప్రాంతాలలోని అన్ని మార్కెట్లో కలిసి 25-30 వేల బస్తాలు సరుకు రాబడిపై రూ. 4500-4650, కాబూలీ శనగలు రూ.9000-10,000 మరియు రాజస్తాన్లోని కేక్, సుమేర్పూర్, కిషనఢ్, బికనీర్, మెడతా, కోటా, రామంజ్మెండి ప్రాంతాలలో అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 10-12 వేల బస్తాలు రూ. 4500-4625, జైపూర్లో రూ. 4925-4950, పప్పు రూ. 5700 మరియు గుజరాత్లోని రాజ్కోట్, దాహోద్ మార్కెట్లలో కలిసి 2500 - 3000 బస్తాలు రూ. 4500 - 4650, నాణ్యమైన సరుకు రూ. 5000-5350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog