పసుపు

  


లభించిన సమాచారం ప్రకారం దేశంలో పసుపు ఉత్పత్తి, మిగులు నిల్వలు, స్టాకిస్టుల కొనుగోళ్లు తగ్గడంతోపాటు డిసెంబర్ తరువాత ఏప్రిల్ వాయిదా రూ. 6740తో సమాప్తమైంది. దీనితో భవిష్యత్తులో వాయిదా వ్యాపారం రూ. 6500-7000 స్థాయిలో కొనసాగగలదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కాగా, ధరలు మరింత తగ్గే సూచన కనిపిస్తున్నది.


మహారాష్ట్రలో ఉత్పత్తి పరిస్థితి మెరుగ్గా ఉంది. కాగా, ఎండల కారణంగా జూన్ వరకు రాబడులు తగ్గే అవకాశం కలదు. జూన్ నుండి రాబడులు పెరగవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకొని వ్యాపారం చేయాల్సి ఉంటుంది. ఎందుకనగా, ఈ సారి వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట సాగు ప్రభావితమయ్యే అవకాశం కలదు. ఈ నేపథ్యంలో స్థానిక మార్కెట్లలో నాణ్యమైన సరుకు ధర తగ్గిన సమయంలో కొనుగోలు చేయడం వలన నష్టానికి ఆస్కారం ఉండదు. గత వారం మహారాష్ట్ర, తమిళనాడులలో గిరాకీ కొరవడినందున ధరలు రూ. 300-400 ప్రతి క్వింటాలుకు తగ్గగా, ఆంధ్ర, తమిళనాడులలో స్థిరంగా ఉన్నాయి. గత సోమవారం ఎన్సిడిఇఎక్స్ వద్ద పసుపు మే వాయిదా రూ. 6874 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం నాటికి రూ. 134 తగ్గి రూ. 6742, జూన్ వాయిదా బుధవారం రూ.6870 తో ప్రారంభం కాగా, శుక్రవారం నాటికి రూ. 40 క్షీణించి రూ. 6830 వద్ద ముగిసింది. నిజామాబాద్ మార్కెట్లో గత సోమ, మంగళ, బుధవారాలలో కలిసి 40-45 వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ.5500-6500, దుంపలు రూ. 4500-5400, కొమ్ములు పాలిష్ సరుకు రూ. 7100, దుంపలు రూ. 6300,మెట్పల్లిలో 4-5 వేల బస్తాలు కొమ్ములు రూ. 4200-5800, దుంపలు రూ. 3800-5400 మరియు కేసముద్రం మార్కెట్లో 800-1000 బస్తాలు కొమ్ములు మరియు దుంపలు రూ. 4500-5500, ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 6-7 వేల బస్తాల కొత్త పసుపు రాబడి కాగా, కొమ్ములు, దుంపలు రూ. 4800–5200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని హింగోళి మార్కెట్లో బుధవారం సుమారు 6-7 వేల బస్తాల సరుకు రాబడి కాగా, కొమ్ములు రూ. 5400-6000, దుంపలు రూ. 4800–5600, బస్మత్నగర్లో 10-12 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 5700-6500, దుంపలు రూ. 5200-5600, నాణ్యమైన కొమ్ములు, దుంపలు రూ. 6500-6800, నాందేడ్లో 18-20 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 5500-6500, దుంపలు రూ. 5200-6000, సాంగ్లీలో 40-45 వేల బస్తాల రాబడి కాగా, రాజాపురి రూ. 6500-7500, మీడియం రూ. 6000–6500, దేశీ కడప రకం సరుకు రూ.5500-6000, పౌడర్ రకం రూ. 9000-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో వారంలో 30-35 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 5299-6399, దుంపలు రూ. 4799-5988 మరియు పెరుందురైలో 3-4 వేల బస్తాలు కొమ్ములు రూ. 4969-6779, దుంపలు రూ. 4569-5710, గోబిచెట్టిపాలయంలో 1000-1200 బస్తాల రాబడి కాగా, కొమ్ములు రూ. 5212–6100, దుంపలు రూ. 4777-5679 ధరతో వ్యాపారమైంది.


Comments

Popular posts from this blog