మద్దతు ధర కంటే తక్కువగా ఉన్న శనగల ధరలు

 


 ఈ ఏడాది దేశంలో శనగ ఉత్పత్తి గత ఏడాదితో పోల్చితే పెర గడంతో ప్రభుత్వ ఏజెన్సీలు మద్దతు ధరతో కొనుగోలు చేసినప్పటికీ, మార్కెట్ ధరలు పెరగడం లేదు. అయితే రెతులు అమ్మకాలు పెరుగుతున్నందున ధరలు స్థిరంగా మారాయి. ఏప్రిల్ 28 వరకు మొత్తం కొనుగోళ్లు 15.36 ల.ట.కు చేరాయి. ఇందులో మహారాష్ట్ర నుండి 5,74,477 టన్నులు, మధ్య ప్రదేశ్లో 4.74 ల.ట., గుజరాత్లో 2.69 ల.ట., కర్ణాటకలో 75 వేల టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 58,458 టన్నులు మరియు తెలంగాణలో 50,238 టన్నులు కొనుగోలు చేయగా రాజస్తాన్లో 31,315 టన్నుల సరుకు నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయబడింది.


ఇండోర్, దేవాస్, ధామనోద్ ప్రాంతాలలో ప్రతిరోజు 9 వేల బస్తాల రాబడిపె గిరాకీ కొరవడడంతో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. మహారాష్ట్రలోని లాతూర్లో రూ. 9500-10,500, మీడియం రూ.6500-7300, ఆకు పచ్చ సరుకు రూ. 8000-10,000 ధరతో వ్యాపారమైంది.

ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు, ఒంగోలు, గుంతకల్, జమ్మలమడుగు, తాడిపత్రి, ఇంకొల్లు ప్రాంతాలలో జెజె శనగలు రూ. 4900, కాక్-2 కాబూలీ శనగలు కొత్త సరుకు రూ. 7700, డాలర్ శనగలు అన్-క్లీన్ సరుకు రూ. 10,300, క్లీన్ సరుకు రూ. 11,000–11,100, జెజె శనగలు మధురై డెలివరి రూ. 5300, కర్ణాటకలోని హుబ్లీ, ధార్వాడ్, గదగ్ ప్రాంతాల సరుకు ఈరోడ్ డెలివరి రూ. 5350-5400, మహారాష్ట్ర సరుకు ఈరోడ్ డెలివరి రూ. 5250, లాతూర్ ప్రాంతం పప్పు సార్టెక్స్ బెంగళూరు డెలివరి రూ. 5850, అకోలా ప్రాంతపు సరుకు రూ. 5725 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మహారాష్ట్రలోని లాతూర్ 8-10 వేల బస్తాల రాబడి కాగా, రూ. 4750-4800, సోలాపూర్లో అన్నిగిరి శనగలు రూ. 4700-5150, మిల్లు రకం సరుకు రూ. 4700-4900, అమరావతి, అకోలా, వాషిం, ధరియాపూర్,బార్షీ, జాల్నా ప్రాంతాలలో రూ. 4550-4725 లోకల్ లూజ్ అకోలా, నాగ్పూర్ నుండి లారీ బిల్టి రూ. రూ. 4950-5050 ధరతో వ్యాపారమైంది.

గత వారం దిల్లీ లారెన్స్ రోడ్ 60-65 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ.5050 మధ్య ప్రదేశ్ సరుకు రూ. 5025, ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 4850, సూడాన్ కాబూలీ శనగలు రూ. 7400, ఇండోర్ శనగలు రూ. 5150-5175 మరియు డాలర్ శనగలు రూ. 9000-10,700, కాబూలీ శనగలు 40-42 కౌంట్ రూ. 12,400, 42-44 కౌంట్ రూ. 12,200, 44-46 కౌంట్ రూ. 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

కర్ణాటకలోని కల్బుర్గిలో రూ. 4800-5000, చిత్రదుర్గ్, యాద్గిర్, బీదర్, సీడెం ప్రాంతాలలో రూ.4000-4950 మరియు మధ్యప్రదేశ్లోని విదిశ, గాడర్వాడ్, అశోక్నగర్, జబల్ పూర్, బసోదా ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి 20-25 వేల బస్తాలు సరుకు రాబడిపై రూ. 4500-4800, కాబూలీ శనగలు రూ.9500-10,200 మరియు రాజస్థాన్లోని కేట్టి, సుమేరుప్పూర్, కిషన్ గఢ్, బికనీర్, మెడతా, కోటా, రామంజ్మండి ప్రాంతాలలో అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 8-10 వేల బస్తాలు రూ. 4500-4600, జైపూర్లో రూ. 5000-5025, పప్పు రూ. 5750 మరియు గుజరాత్లోని రాజ్కోట్, దాహోద్ మార్కెట్లలో కలిసి 3-4 వేల బస్తాలు రూ. 4500-4850, నాణ్యమైన సరుకు రూ. 5000-5550 మరియు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్, ఉరె ప్రాంతాలలో రూ.4000-4750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.



గణనీయంగా వృద్ధి చెందిన సిరిశనగ ఉత్పత్తి - ధరలకు కళ్లెం


 దేశంలో 2022-23 సీజన్ సిరిశనగ ఉత్పత్తి గత ఏడాదితో పోల్చితే 12.69 ల.ట. నుండి 26 శాతం పెరిగి 15.99 ల.ట.కు చేరగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తమ రెండో ముందస్తు అంచనాలో పేర్కొన్నగా, 11 ల.ట. నుండి పెరిగి 14 ల.ట.కు చేరగలవని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రస్తుత సీజన్లో కనీస మద్దతు ధరతో నాఫెడ్ చేపట్టిన కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఇప్పటి 523 టన్నుల సరుకు కొనుగోలు చేయగలిగింది. మొత్తం కొనుగోళ్లు 1 ల.ట.కు చేరగలవని తెలుస్తోంది. ఎందుకనగా మద్దతు ధర రూ. 6000 నిర్ధారించగా మధ్యప్రదేశ్ స్వేచ్ఛా విపణిలో రూ. 5200-5500, ఉత్తరప్రదేశ్లో 5450-5900 వద్ద కదలాడుతున్నది.

దేశంలో 2023-24 సీజన్ కోసం సిరిశనగ దిగుమతులు 2022-23 తో పోల్చితే 7.70 ల.ట. నుండి తగ్గి 6.50 ల.ట.కు పరిమితం కాగలవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకనగా, దేశంలోని ఉత్పాదక రాష్ట్రాలలో దిగుబడులు సమృద్ధిగా ఉండడమే ఇందుకు నిదర్శనం. అయితే, కొన్ని ప్రాంతాలలో కురిసిన

అకాల వర్గాలకు సరుకు నాణ్యత లోపించగా చౌక ధరతో సరఫరా అవుతున్నది. సాగర్ జిల్లాలో ప్రతి రోజు 12-15 వేల బస్తాల సిరిశనగ రాబడిపై ప్రతి క్వింటాలు రూ. 5200-5550 ధరతో వ్యాపారమవుతున్నందున ధరలు మరింత దిగజారే అవకాశం ఉండదని స్పష్టమవుతున్నది. ఎందుకనగా కందిపప్పు లభ్యత కుంటుపడినందున సిరశనగ వినియోగం పెరగడం తప్పనిసరి కావడమే ఇందుకు నిదర్శనం. సరుకు రాబడి అవుతున్న తరుణంలో ధరలు కొంతమేర తగ్గినా అటు తర్వాత పైకి ఎగబాకగలవు. ఎల్నినొ విస్తరించే అవకాశం ఉన్నందున ఖరీఫ్ అపరాల పంటల పరిస్థితి ప్రశ్నార్థకం కానున్నది. దీని వలన దిగుమతులు పోటెత్తగలవని తెలుస్తోంది. ప్రభుత్వం కూడా బఫర్ నిల్వల కోసం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియాలో సిరిశనగ ఉత్పత్తి గత ఏడాదితో పోల్చితే దాదాపు 35-40 శాతం వృద్ధి చెందుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తద్వారా భారత్ కోసం 555-590 డాలర్ ప్రతి టన్ను ధరతో విక్రయిస్తున్నది. గణనీయమైన ఉత్పత్తి వలన మున్ముందు ధరలు తగ్గే అవకాశం కనిపిస్తున్నది.


Comments

Popular posts from this blog