నిలకడగా ఉన్న బఠాణీల ధరలు

 


 కెనడా జాతీయ స్టాటిస్టిక్స్ శాఖ వారి వివరాల ప్రకారం 2023 కోసం కెనడాలో 9500 మంది రైతుల ద్వారా నిర్వహించబడిన ఒక సర్వేలో వీరు సిరిశనగ, బఠాణీల విస్తీర్ణం తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో రాబడులు పెరగడం మరియు గిరాకీ కొరవడినందున ధరలు రూ. 50-75 తగ్గాయి.

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో తెల్ల బఠానీలు రూ.3800 -4150, ఆకు పచ్చ బఠానీలు రూ. 4500-4750, లలిత్పూర్లో 8-9 వేల బస్తాల తెల్ల బఠాణీల రాబడిపై రూ.3750-4150 మరియు 2500 బస్తాల ఆకుపచ్చ సరుకు రాబడిపై రూ. 4650-5200, మహోబాలో 5-6 వేల బస్తాల రాబ డిపె రూ. 3800-4250 మరియు 700-800 బస్తాల ఆకుపచ్చ సరుకు రాబడి కాగా, రూ. 4800–5200, ఉరెలో 1000-1200 బస్తాలు తెల్లవి రూ. 3820-4030 మరియు 200 బస్తాల ఆకుపచ్చ బఠానీల రాబడి కాగా, రూ. 4500-4725 ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని డబ్రా, దతియా ప్రాంతాలలో ప్రతిరోజు 4-5 వేల బస్తాల రాబడిపై రూ.3800-4300, ఆకు పచ్చ బఠానీలు రూ. 4500-4800, కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 4200 -4300, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 4150-4250 ధరతో వ్యాపారమైంది

Comments

Popular posts from this blog