బలోపేతం చెందిన ఆముదాల వాయిదా ధరలు

 


గతవారం ఎన్సిడిఇఎక్స్ మే వాయిదా మంగళవారం రూ. 5918 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 102 తగ్గి రూ. 6020, జూన్ వాయిదా రూ. 113 బలపడి రూ. 6103 తో ముగిసింది. 


గుజరాత్లో గతవారం సుమారు 1.30 నుండి 1.50 లక్షల బస్తాల రాబడిపై రూ. 5850-5985 మరియు తెలంగాణాలోని మహబూబ్ నగర్, దేవరకద్ర, గద్వాల, జడ్చర్ల ప్రాంతాలలో వారంలో 3-4 వేల బస్తాల రాబడిపై రూ. 5000-5490, ఆదోనిలో 1000-1200 బస్తాల రాబడిపె రూ. 5250-5420 మరియు ఎమ్మిగనూరు, కర్నూలు ప్రాంతాలలో 3-4 వేల బస్తాల రాబడిపై రూ. 5250-5400, వినుకొండ, గిద్దలూరు ప్రాంతాలలో 4-5 లారీల రాబడిపై రూ. 5300-5400 ధరతో వ్యాపారమయింది. నరసారావుపేటలో బిఎస్ఎస్ నూనె టాక్స్ పెయిడ్ ప్రతి 10 కిలోలు రూ. 1390, కమర్షియల్ రూ. 1350, ఆముదం పిండి మంగళగిరి, తెనాలి డెలివరి రూ. 1900, హెదరాబాద్లో నూనె బిఎస్ఎస్ రూ. 1360, కమర్షియల్ రూ. 1320, పిండి లూజ్ రూ. 1700 మరియు ఆముదాలు రూ. 5700 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog