క్షీణిస్తున్న మెంతుల ధరలు

 



 గత వారం మీడియం రకం మెంతులకు డిమాండ్ తగ్గి నందున ధర రూ. 150-200 ప్రతి క్వింటాలుకు తగ్గింది. కాగా, నాణ్యమైన సరుకు ధరలు స్థిరంగా ఉన్నాయి.


మధ్య ప్రదేశ్లోని జావ్రాలో 15-16 వేల బస్తాల మెంతుల రాబడిపై యావరేజ్ సరుకు రూ. 5500-5700, మీడియం రూ. 6000-6100, నాణ్యమైన సరుకు రూ. 6500-6800, పాప్డా రూ. 8700-9000 మీడియం రూ. 7500-8500 మరియు నీమచ్లో 10-12 వేల బస్తాలు యావరేజ్ రూ. 5100–5200, మీడియం రూ. 5500-5600, నాణ్య మెన సరుకు రూ. 6200-6400, నాణ్యమైన బోర్డు సరుకు రూ. 6700-6900, మందసోర్లో 3-4 వేల బస్తాలు మీడియం రూ. 5000–5200, నాణ్యమైన సరుకు రూ. 5800-6100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గుజరాత్లోని రాజ్కోట్లో 2000-2500 బస్తాలు యావరేజ్ రూ. 5900–6100, మీడియం రూ. 6000-6200, నాణ్యమైన సరుకు రూ. 6500-6800, కిరాణా రకం రూ. 6850-7600, జామ్ నగర్లో 4-5 వేల బస్తాలు మీడియం రూ. 5600-5900, నాణ్యమైన సరుకు రూ. 6200-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజస్తాన్ లోని కోటా మార్కెట్లో 3-4 వేల బస్తాల కొత్త మెంతులు రాబడి కాగా నిమ్ము సరుకు రూ. 3500-4000, మీడియం బెస్ట్ రూ. 4500-5000, ఎండు సరుకు రూ.6000-6500, రామ్ గంజ్మండి, కోటా, బారన్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 2-3 వేల బస్తాలు, నోఖాలో 3-4 వేల బస్తాలు నిమ్ము సరుకు రూ. 4000 – 4500, ఎండు సరుకు రూ. 5800-6200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog