పెరిగిన మొక్కజొన్న రాబడులు

 


 బిహార్, జార్ఖండ్లలో కొత్త మొక్కజొన్న రాబడులు పెరగడంతో పాటు అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 1 లక్ష బస్తాలకు పెగా రాబడి కాగా, నిమ్ము రకం రూ. 1600-1700, ఎండు రకం సరుకు రూ. 1750 ధరతో వ్యాపారమె మధ్యప్రదేశ్, దిల్లీ, పంజాబ్, రాయ్ పూర్ తదితర ప్రాంతాల కోసం ఎగుమతి అవుతోంది. ధరలు ఆశాజనకంగా లేనందున అనేక మంది రైతులు వేర్ హౌజ్లో సరుకు నిల్వ చేస్తున్నారు. అంతేకాకుండా వెగన్ లోడింగ్ రూ. 1740-1770 వరకు వ్యాపారమౌతున్నది.

 

సాలూరు, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో దినసరి 60-70 లారీలు, నంద్యాల, హిందుపూర్, మడకశిర ప్రాంతాలలో వర్షాల కారణంగా కేవలం 40-50 వాహనాల రాబడిపై రూ. 1800-1830, విశాఖపట్టణం ఓడరేవు డెలివరి రూ. 1930-1950, తూర్పు ఆంధ్ర ప్రాంతాల నుండి తమిళనాడు డెలివరి రూ. 2100, జంగారెడ్డి గూడెం, కోయలగూడెం ప్రాంతాలలో ప్రతిరోజు 10-15 వాహనాల రాబడి కాగా, రూ. 1800-1850, తణుకు డెలివరి రూ. 1900 ధరతో వ్యాపార మెంది. మరియు వరంగల్, కేసముద్రంలలో ప్రతిరోజు 12-15 వేల బస్తాలు రూ. 1400–1860 ధరతో వ్యాపారమెంది.

నిమామాబాద్ తదితర మార్కెట్లలో అకాల వర్షాలతో కేవలం 35-40 వాహనాల రాబడి కాగా, రూ. 150-200 తగ్గి రూ.1450-1700 ధరతో వ్యాపారమె మహారాష్ట్ర, గుజరాత్ ల కోసం రవాణా అవుతోంది.

కర్ణాటకలోని చిత్రదుర్గ, చల్లకేరి, బళ్ళారి పరిసర ప్రాంతాలలో ప్రతిరోజు 30-35 వేల బస్తాలు రూ. 1625-1850, ఈరోడ్, నమక్కల్ డెలివరి రూ. 2100-2120 ధరతో వ్యాపారమెంది. తమిళనాడులోని ఉలుండుర్పేట, కల్ల కుర్చి, శంకరాపురం, తిరుకోవిలూరు, విరుధచలం ప్రాంతాలలో వారంలో 3-4 వేల బస్తాల రాబడి కాగా, 1670-1940, దిండిగల్ ప్రాంతంలో దినసరి 5-6 వేల బస్తాలు, కోవిల్పట్టి, రాజపాలయం, శంకరన్ కోవిల్ ప్రాంతాలలో 10-15 వాహనాల రాబడి కాగా, రూ. 1800-1850, నామక్కల్, పలడం డెలివరి రూ. 2100 మరియు మధ్య ప్రదేశ్లో 10-13 వేల బస్తాల రాబడి కాగా, రూ. 2050, మీడియం రూ. 2000 ధరతో వ్యాపారమైంది.


Comments

Popular posts from this blog