శనగలకు కొరవడిన గిరాకీ

 


 ప్రస్తుత సీజన్లో మే 4 వరకు నాఫెడ్ వారు దేశంలో 16,30,873 టన్నుల శనగలు కొనుగోలు చేయగా, కర్ణాటక నుండి 76,860 టన్నులు, గుజరాత్ నుండి 2,80,867, మహారాష్ట్ర నుండి 5,94,553, ఆంధ్ర నుండి 60,060 టన్నులు, తెలంగాణ నుండి 5,238 టన్నులు, మధ్య ప్రదేశ్ నుండి 5,25,193, ఉత్తరప్రదేశ్ నుండి 4745, రాజస్థాన్ నుండి 38,357 టన్నుల సరుకు కొనుగోలు చేశారు. 


నాఫెడ్ వారు కనీస మద్దతు ధరతో కొను గోలు చేస్తున్నందున స్థానిక మార్కెట్లలో ఇప్పటికీ, రైతుల సరుకు రాబడులతో పాటు గిరాకీ సాధారణంగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఒంగోలు, గుంతకల్, జమ్మలమడుగు, తాడిపత్రి, ఇంకొల్లు ప్రాంతాలలో జెజె శనగలు రూ. 4900, కొత్త కాక్-2 కాబూలీ శనగలు కొత్త సరుకు రూ. 7800, డాలర్ శనగలు అన్-క్లీన్ సరుకు రూ.10,300, క్లీన్ సరుకు రూ. 11,200-11,300, జెజె శనగలు మధురై డెలివరి రూ. 5350, కర్ణాటకలోని హుబ్లీ, ధార్వాడ్, గదగ్ ప్రాంతాల సరుకు ఈరోడ్ డెలివరి రూ.5400-5450, మహారాష్ట్ర సరుకు ఈరోడ్ డెలివరి రూ. 5200-5250, లాతూర్ ప్రాంతం పప్పు సార్టెక్స్ బెంగళూరు డెలివరి రూ. 5850, అకోలా ప్రాంతపు సరుకు రూ. 5700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మహారాష్ట్రలోని లాతూర్ లో 7-8 వేల బస్తాల రాబడి కాగా, రూ. 4850-4925, సోలాపూర్లో అన్నిగిరి శనగలు రూ. 4800-5150, మిల్లు రకం సరుకు రూ. 4700-4875, అమరావతి, అకోలా, వాషిం, ధరియాపూర్, బార్షీ, జాల్నా ప్రాంతాలలో 10-12 వేల బస్తాలు రూ. 4600-4800 లోకల్ లూజ్, అకోలా, నాగ్పూర్ నుండి లారీ బిల్టి రూ. రూ. 5000-5075 ధరతో వ్యాపారమైంది.

గత వారం దిల్లీ లారెన్స్ రోడ్ 60-65 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 5100-5125, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 5075, ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 4850, సూడాన్ కాబూలీ శనగలు రూ. 7400, ఇండోర్లో శనగలు రూ.5150-5150 మరియు డాలర్ శనగలు రూ. 9000-11,000, కాబూలీ శనగలు 40-42 కౌంట్ రూ. 12,400, 42-44 కౌంట్ రూ. 12,200, 44-46 కౌంట్ రూ. 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

కర్ణాటకలోని కల్బుర్గిలో రూ. 4650-4800, చిత్రదుర్గ్, యాద్గిర్, బీదర్, సేడెం ప్రాంతాలలో రూ. 4550 - 4800 మరియు మధ్య ప్రదేశ్లోని విదిశ, గాడర్వాడ్, అశోక్ నగర్, జబల్పూర్, బసోదా ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి 15-20 వేల బస్తాలు సరుకు రాబడిపై రూ. 4500-4775, కాబూలీ శనగలు రూ. 9600-10,500 మరియు రాజస్తాన్లోని కేక్, సుమేర్పూర్, కిషన్ గఢ్, బికనీర్, మెడతా, కోటా, రామంజ్మండి ప్రాంతాలలో అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 7-8 వేల బస్తాలు రూ. 4500-4750, జైపూర్ రూ. 5025-5050, పప్పు రూ. 5750 మరియు గుజరాత్లోని రాజ్కోట్, దాహోద్ మార్కెట్లలో కలిసి 2-3 వేల బస్తాలు రూ. 4500-4800, నాణ్యమైన సరుకు రూ. 5000-5600 మరియు ఉత్తరప్రదేశ్లోని లలితూర్, ఉరె ప్రాంతా లలో రూ. 4600-4700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog