రికార్డు రాబడులతో యాలకులలో పెరుగుదల సమాప్తం




02-02-2022

లభించిన సమాచారం ప్రకారం ఈశాన్య భారతంలోని ఉత్పాదక ప్రాంతాల నుండి సరఫరా మెరుగ్గా ఉండడం మరియు దక్షిణాదిలో ధరలు తగ్గడంతో ఈ ప్రభావం పెద్ద యాలకులపై పడింది. స్టాకిస్టులు కూడా సరుకు నిల్వ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే జనవరి 27న సిక్కింలోని సింగటమ్ చిన్నగింజ సరుకు ముందు వారంతో పోలిస్తే రూ. 572.50 నుండి పెరిగి 597.50, పెద్ద గింజ రూ. 630 నుండి వృద్ధిచెంది రూ. 655, గాంగ్టక్లో చిన్నగింజ సరుకు రూ. 600 నుండి తగ్గి రూ. 575, పెద్దగింజ సరుకు రూ. 700 నుండి తగ్గి రూ.675, పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో చిన్నగింజ రూ. 675 నుండి పెరిగి రూ. 683.75, పెద్దగింజ రూ. 735 నుండి పెరిగి 742.50 ప్రతి కిలో ధరతో వ్యాపారమైంది.





వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది యాలకుల ఉత్పత్తి పెరగడంతో ఆగస్టు నుండి ఇంతవరకు ధరలు తగ్గుముఖంలో ఉండడంతో రెత్తులు మసాలా బోర్డును జోక్యం చేసుకోవాల్సిందిగా కోరినప్పటికీ, ఎలాంటి స్పందన లేకపోవడంతో మరియు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 2022–23లో కూడా మరోసారి పెరిగే అవకాశం ఉండడం మరియు కొత్త సీజన్ ప్రస్తుత సంవత్సరం మాదిరిగానే మిగులు నిల్వలతో ప్రారంభమయ్యే అంచనా ఉండడంతో ప్రస్తుతం రెత్తులు తమ సరుకును విక్రయించడం ప్రారంభించారు. దీనితో దినసరి 1.30 కిలోలకు మించి యాలకులు రాబడి కాగా గత వారం కేవలం 5 రోజులలో 7,04,281 కిలోల రాబడి కాగా, 6,73,560 కిలోల సరుకు అమ్మకం అయింది. ఇందులో శనివారం సగటు ధర ప్రతి కిలో రూ. 844.51, గరిష్టంగా సరుకు రూ. 932.46 ధరతో అమ్మకమెంది. ఈ ఏడాది మార్చి 15 వరకు దినసరి రాబడులు 1 లక్ష కిలోల కంటే తగ్గే అవకాశం లేదు. స్టాకిస్టులు ముందుకు రావడం లేదు. ఎగుమతులు కూడా తగ్గాయి. అయితే మార్చి చివరి వారంలో రంజాన్ సందర్భంగా ఎగుమతి డిమాండ్ నెలకొనే అవకాశం కలదు.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు