బొబ్బర్లు : ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలిలో ప్రతి రోజు 5 క్వింటడాళ్లు, గురుమిట్కల్లో 1000–1500 బస్తాల బొబ్బర్ల రాబడిపై రూ. 4550 ప్రతి క్వింటాలు ధరతో వ్యారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. రాయచోటిలో 4-5 వాహనాల బొబ్బర్ల రాబడిపై నలుపు సరుకు రూ. 5500, తెలుపు రూ. 4450, కర్ణాటకలోని మైసూరు, హగరిబొమ్మనహళ్లి, బళ్లారి ప్రాంతాలలో ప్రతి రోజు 1000 బస్తాలు గులాబీ రకం రూ. 6000-6800, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఉలువలు : కర్ణాటకలోని మైసూరులో ప్రతి రోజు 8 వాహనాల ఉలువల రాబడిపై 200 బస్తాలు రూ. 3400–3600 మరియు ఆంధ్రప్రదేశ్లోని 00, బళ్లారిలో . 3700, రాయచోటిలో వారంలో 100 బస్తాలు రూ. 3700 మరియు 300 బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై ఒంగోలు డెలివరి రూ. 3500 విజయనగరంలో 3 వాహనాల సరుకు అమ్మకంపై రూ. 4000-4500, నలుపు సరుకు రూ. 6000-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం కోసం రవాణా అవుతున్నది.
రాగులు : తెలంగాణలోని మహబూబ్ నగర్ లో ప్రతి రోజు 2 వాహనాల రాగులు రాబడిపై రూ. 3000-3500, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో నిల్వ అయిన సరుకు తాడేపల్లిగూడెం డెలివరి రూ.3500 - 3600 ధరతో వ్యాపారమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు