భారీగా పెరిగిన మొక్కజొన్న విస్తీర్ణం

 


01-02-2022

ప్రస్తుత సీజన్లో 28, జనవరి వరకు దేశంలో మొక్కజొన్న విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 17.02 లక్షల హెక్టార్ల నుండి 7.9 శాతం పెరిగి 18.37 లక్షల హెక్టార్లకు చేరింది మరియు ఈ ఏడాది యాసంగి సీజన్ కోసం కేంద్రం ముతక ధాన్యాల కోసం లక్ష్యాన్ని గత ఏడాదితో పోలిస్తే 7.85 లక్షల హెక్టార్ల నుండి పెంచి 8.79 లక్షల హెకార్లకు నిర్ధారించింది. దీనితో బీహార్ లో ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశం కలదు.






తమిళనాడులోని దిండిగల్లో దినసరి 10-15 లారీల కొత్త సరుకు రాబడిపై స్థానికంగా రూ.1800 2000, ఈరోడ్, నావుక్కల్, ఉడుముల్ పేట కోసం రూ.2000-2150 ధరతో వ్యాపార మయింది. కల్లకుర్చ, చిన్నసేలం, శంకరాపురం, ఉలుండు పేట, తిరుకోవిలూరు ప్రాంతాలలో దినసరి 10-15 లారీల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 1700 -1850, నామక్కల్, ఈరోడ్, పల్లడమ్ డెలివరీ రూ. 2075 - 2150, రాజపాలయం, శంకరన్ కోవిల్, పెరుంబలూరు, ధారాపురం, పుదుకొట్టై, కోవిల్పట్టి మొదలగు మొక్కజొన్న ఉత్పాదక కేంద్రాలలో దినసరి 25-30 లారీల కొత్త సరుకు రాబడిపై రూ. 1850-1900, ఈరోడ్, నామక్కల్ డెలివరీ రూ. 2050-2150 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.


హిందూపూర్, మడకశిర ప్రాంతాలలో 100-150 టన్నుల మొక్కజొన్న రాబడిపై డ్యామేజ్ రకం రూ. 1650-1750, నాణ్యమైన సరుకు రూ. 1780-1850 మరియు బెంగుళూరు డెలివరీ బెస్ట్ రకం రూ. 2000-2050, విజయనగరం, సాలూరు ప్రాంతాలలో దినసరి 10-12 లారీల అమ్మకంపై స్థానికంగా రూ. 2000, సర్పవరం డెలివరీ రూ. 2200,

 వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాలలో 2-3 వేల బస్తాల రాబడిపై రూ. 1700–1850 ధరతో వ్యాపారమయింది.

 ఒరిస్సాలోని మొక్కజొన్న ఉత్పాదక ప్రాంతాలలో దినసరి 18-20 లారీల రాబడిపై స్థానికంగా రూ. 1700-1850, విజయనగరం డెలివరీ రూ. 1900-2100 ధరతో వ్యాపార మయింది. 

కర్నాటకలోని చిత్రదుర్గలో దినసరి 45-50 వేల బస్తాల రాబడిపై రూ. 1850-2000, బళ్లారి, చెల్లకేరి, బెల్గాంవ్, దావణగిరి, శివమొగ్గ తదితర ప్రాంతాల మార్కెట్లలో దినసరి 25-30 వేల బస్తాల రాబడిపై రూ. 1750-2000, తమిళనాడు డెలివరీ రూ. 2150-2200 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమై తమిళనాడులోని నామక్కల్, ఉడుముల పేటై, పల్లడంల కోసం రవాణా అయింది.






Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు