యాలకులు

 

15-02-2022

యాలకుల ఉత్పాదకులకు గిట్టుబాటు ధరలు లభ్యమయ్యేందుకు మసాలా బోర్డు చేస్తున్న కృషిలో భాగంగా వేలం కేంద్రాల వద్ద 65 వేల కిలోల సరుకు విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈ పరిణామంతో కొద్ది రోజుల వరకు ప్రతి కిలో ధర రూ. 100-150 వృద్ధి చెంది గరిష్ఠంగా రూ. 993.86 కు ఎగబాకిన తర్వాత శనివారం తిరోగమనంతో ధర రూ. 860.73 పరిమితమైంది. 





సోమవారం 1.22 లక్షల కిలోల యాలకులు రాబడి కాగా ఉత్పాతకులకు ప్రతి కిలోల ధర రూ. 993 మరియు రూ. 985 లభ్యమైంది. శనివారం రాబడులు 10 వేల కిలోలు తగ్గి 1.12 లక్షల కిలోల రాబడిపై కనిష్ఠ ధర రూ. 860 మరియు గరిష్ఠ ధర రూ. 917 లభ్యమైంది. గణనీయమైన ఉత్పత్తి మరియు కొరవడిన ఎగుమతి డిమాండ్తో ధరలు పురోగమించడంలేదని వ్యాపారులు భావిస్తున్నారు. గత వారం (ఫిబ్రవరి 8-12) పది వేలం కేంద్రాల వద్ద 5,95,802 కిలోలు రాబడి కాగా 5,84,197 కిలోల సరుకు అమ్మకమైంది. అమ్మకాలు ఇదే విధంగా ఉన్నట్లయితే వేలం కేంద్రాల వద్ద సరుకు రాబడులు ఇనుమడించే అవకాశం ఉంది. పెద్ద యాలకులు: సిక్కింలోని గాంగ్టక్లో గత వారం నల్ల యాలకుల బోర్డు సరుకు రూ. 625, చిన్న గింజ సరుకు రూ. 587.50, గాంగ్టక్ గరిష్ఠంగా రూ.650 కనిష్ఠ ధర రూ. 575, పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో గరిష్ఠ ధర రూ. 745 కనిష్ఠ ధర రూ. 657.50, దిల్లీ సరుకు ఝుండి రకం ధర రూ. 15-20 ఇనుమడించి రూ. 720 ధరతో అమ్మకమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు