ఈ ఏడాది దేశంలో ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న సేద్యం భారీగా విస్తరించినప్పటికీ అతివృష్టి, సంభవించి పంటకు నష్టం వాటిల్లింది. తగ్గిన ఉత్పత్తి, విదేశాల నుండి పెరిగిన డిమాండ్, కరోనా మహమ్మారి నుండి పొందుతున్న ఊరట మరియు పౌల్ట్రీ పరిశ్రమకు ఇనుమడించిన డిమాండ్తో ధరలు మొక్కజొన్న ధరలు ఇనుమడిస్తున్నాయి. రబీ సీజన్ రాబడులు ప్రారంభమయ్యాయి. మరో రెండు వారాల్లో రాబడులు మరింత ఉధృతం కాగలవు.
బీహార్ తోపాటు తూర్పు భారత్లో ఏప్రిల్-మే నెలలో రాబడులు ప్రారంభం కాగలవు. తద్వారా మరోసారి ధర రూ. 100-150 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందగలదని వ్యాపారులు భావిస్తున్నారు. ఎందుకనగా, ఖరీఫ్ సీజన్ సరుకు అక్టోబర్ వరకు రాణించే అవకాశం లేకపోవడమే ఇందుకు నిదర్శనం.
తమిళనాడు దిండిగలో ప్రతి రోజు 10 వాహనాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 1900-1950, ఈరోడ్, నమక్కల్, ఉడుముల్పేట కోసం రూ. 2100- 2170,
కల్లకుర్చి, తిరుకోవిలూరు, చిన్నసేలం, ఉలుండరుపేట, శంకరాపురం ప్రాంతాలలో 3-4 వాహనాలు రూ. 1800-1980,
నమక్కల్, ఈరోడ్, పల్లడం డెలివరి రూ. 2120–2200, రాజుపాలయం, శంకరన్ కోవిల్, పెరంబూరు, ధారాపురం, పుదుకొట్టై, కోవిల్పట్టి ప్రాంతాలలో 15-20 వాహనాలు 13-14 శాతం నిమ్ము సరుకు రూ. 1950–2000, ఈరోడ్, నమక్కల్ డెలివరి రూ. 2150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, మడకశిర ప్రాంతాలలో 12-15 వాహనాలల మొక్కజొన్న రాబడిపై నాసిరకం సరుకు రూ.1850, నాణ్యమైన సరుకు రూ. 1950, బెంగుళూరు డెలివరి రూ. 2050, విజయనగరం, సాలూరు ప్రాంతాలలో ప్రతి రోజు 7–8 వాహనాలు సరుకు అమ్మకంపై స్థానికంగా రూ. 2100, సర్పవరండెలివరి రూ. 2100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది.
తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ ప్రాంతాలలో 3 వేల బస్తాలు రూ. 1900-1950 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని చిత్రదుర్గ్లో ప్రతి రోజు 15-16 వేల బస్తాలు రూ. 1935-2000, బళ్లారి, చెల్లకేరి, బెల్గాం, దావణగెరె, శిమోగా మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో ప్రతి రోజు 15-20 వేల బస్తాలు రూ. 2000, నమక్కల్ డెలివరి లారీబిల్టి రూ. 2150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ప్రాంతాల సరుకు పంజాబ్ డెలివరి రూ. 2165-2280, ఆంధ్రప్రదేశ్ సరుకు తమిళనాడు, బెంగుళూరు డెలివరి రూ. 2050-2150, ఛత్తీస్గఢ్ బేసన్ రకం రూ. 1940, పశుగ్రాసం సరుకు రూ. 1900 మరియు 5-8 శాతం నాసిరకం సరుకు రూ. 1860 మరియు మార్చి 31 వరకు డెలివరి కండిషన్పై రూ. 1900 ధరతో కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 60 65 వేల బస్తాల మొక్కజొన్న రాబడి అవుతున్నది. ఇందులో నీమన్లో వారంలో 5-6 వేల బస్తాలు తెల్లమొక్కజొన్న రకం రూ. 1850-2050, పచ్చమొక్కజొన్న 1925-1950, మీడియం రూ. 1850-1900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపరమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు